Srisailam temple: న్యూఇయర్ వేడుకల పేరుతో హంగామా.. శ్రీశైలం సిబ్బంది వీడియో వైరల్
ABN , Publish Date - Jan 03 , 2026 | 02:22 PM
శ్రీశైలంలో ప్రైవేటు అన్నదాన సత్రం సిబ్బంది వికృత చేష్టలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. డిసెంబర్ 31న అర్ధరాత్రి న్యూఇయర్ వేడుకల పేరుతో వారు చేసిన హంగామా అంతా ఇంతా కాదు. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమంలో వైరల్ అవుతోంది.
నంద్యాల, జనవరి 3: ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలం శ్రీ భ్రమరాంబికా మల్లికార్జున స్వామి దేవాలయంలో (Srisailam Temple) సిబ్బంది వికృత చేష్టలు కలకలం రేపుతున్నాయి. డిసెంబర్ 31 అర్ధరాత్రి న్యూ ఇయర్ వేడుకల్లో శ్రీశైలంలోని ప్రైవేటు అన్నదాన సత్రం సిబ్బంది హంగామా వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ పేరుతో సినిమా ఐటమ్ సాంగ్స్‌పై సత్రం సిబ్బంది డ్యాన్స్‌లు చేయడం వివాదానికి దారి తీసింది. దేవాదాయశాఖ నిబంధనలు ఉల్లంఘించి మరీ సినిమా ఐటమ్ సాంగ్‌లతో సత్రం సిబ్బంది న్యూ ఇయర్ వేడుకలు జరుపుకున్నారు.
వీరి డ్యాన్స్‌లకు సంబంధించిన వీడియో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం సత్రం సిబ్బంది వీడియో సోషల్ మీడియాలో తెగ హల్‌చల్ చేస్తోంది. ఈ వీడియోపై నెటిజన్లు, మల్లన్న భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
ఇటీవల శ్రీశైలం సమీపంలో ఓ యువతి రీల్స్ చేయడం ఎంతటి దుమారాన్ని రేపిందో అందరికీ తెలిసిందే. భక్తుల మనోభావాలకు భంగం కలిగించేలా రీల్స్ చేసిన యువతిపై సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. దీంతో స్పందించిన యువతి.. తాను దేవాలయంలో డ్యాన్స్ చేయలేదని స్పష్టం చేసింది. సాంగ్‌లో శారీ కట్టుకుని సాంప్రదాయంగానే డ్యాన్స్ చేసినట్లు చెప్పుకొచ్చింది. తప్పు ఉంటే క్షమించాలని కోరుతూ యువతి సెల్ఫీ వీడియోలో తెలిపింది. మరోవైపు ఈ ఘటనను శ్రీశైలం దేవస్థానం అధికారులు కూడా సీరియస్‌గా తీసుకున్నారు. దేవస్థానం అనుమతి లేకుండా క్షేత్ర పరిధిలో శ్రీశైలంలో ఎక్కడైనా వీడియోలు, ఫోటోలు తీస్తే చట్టపరమైన చర్యలు ఉంటాయని శ్రీశైలం దేవస్థానం అధికారులు వెల్లడించారు.
ఈ క్రమంలో డిసెంబర్ 31న శ్రీశైలంలో ప్రైవేటు అన్నదాన సత్రం సిబ్బంది వ్యవహారంపై దేవస్థానం అధికారులు స్పందన ఎలా ఉంటుందో చూడాలి మరి.
ఇవి కూడా చదవండి...
గాల్లో చక్కర్లు కొట్టిన సింగపూర్ ఇండిగో ఫ్లైట్.. అరగంట తర్వాత..
అమరావతిలో మంత్రులు, జడ్జిల భవనాలపై మంత్రి కీలక ప్రకటన
Read Latest AP News And Telugu News