Share News

Narayana: అమరావతిలో మంత్రులు, జడ్జిల భవనాలపై మంత్రి కీలక ప్రకటన

ABN , Publish Date - Jan 03 , 2026 | 01:25 PM

అమరావతి క్యాపిటల్ సిటీలో నిర్మిస్తున్న మంత్రులు, జడ్జిల భవనాలను త్వరలోనే పూర్తి చూసి హ్యాండ్ ఓవర్ చేస్తామని మంత్రి నారాయణ వెల్లడించారు. ఈ ఏడాది వర్షాలు ఎక్కువగా రావడం వల్ల కొన్ని పనులు ఆలస్యం అయ్యాయని తెలిపారు.

Narayana: అమరావతిలో మంత్రులు, జడ్జిల భవనాలపై మంత్రి కీలక ప్రకటన
Minister Narayana

అమరావతి, జనవరి 3: అమరావతి క్యాపిటల్ సిటీలో నిర్మిస్తున్న రాష్ట్ర మంత్రులు, ఐఏఎస్ అధికారులు, జడ్జిల నివాస భవనాలపై మంత్రి నారాయణ (Minister Narayana) కీలక ప్రకటన చేశారు. నివాస భవనాల పనులు ఈ ఏప్రిల్‌లో పూర్తి చేసి హ్యాండ్ ఓవర్ చేయనున్నట్లు తెలిపారు. అమరావతిలో మొత్తం 4,026 భవనాలు, ఫ్లాట్లు నిర్మించబడుతున్నాయని చెప్పారు. వీటిలో 186 బంగ్లాలు ఉండగా, మిగతా 3,850 భవనాలు అపార్ట్‌మెంట్ మోడల్లో నిర్మాణం జరుగుతున్నట్లు తెలిపారు.


ఈ ఏడాది వర్షాలు ఎక్కువగా రావడం వల్ల కొన్ని పనులు ఆలస్యం అయ్యాయని, అయితే ఇప్పుడు అన్ని నిర్మాణాలను పూర్తి చేయడానికి చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు. మంత్రుల బంగ్లాలు చాలా వరకు పూర్తయ్యాయన్నారు. జడ్జీల బంగ్లాల్లో బ్రిక్ వర్క్, ప్లాస్టింగ్ తుద దశకు చేరిందని.. అఖిల భారత సర్వీసు అధికారుల టవర్స్ కూడా తుది దశకు చేరాయని చెప్పారు.


500 నివాస సముదాయాలను మినహా, మిగతా భవనాలు మార్చి ముగింపు వరకు పూర్తి చేయడం లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. అన్ని భవనాలు పూర్తైన తర్వాత జీఏడీకి హ్యాండ్ ఓవర్ చేస్తామని.. వారు కేటాయిస్తారని మంత్రి తెలిపారు. అలాగే అమరావతి సీడ్ యాక్సిస్ రోడ్ కోసం భూసేకరణ నోటిఫికేషన్ వచ్చే బుధవారం (జనవరి 7) ఇవ్వనున్నట్లు చెప్పారు. ఇంకా 4.5 ఎకరాలు భూమి రావాల్సి ఉందని, ఇందులో 2 ఎకరాలు ఇచ్చేందుకు సుముఖంగా ఉన్నట్లు మంత్రి నారాయణ వెల్లడించారు.


ఇవి కూడా చదవండి...

ఎయిర్, వాటర్ ప్యూరిఫయ్యర్స్‌పై పన్ను కోత.. యోచనలో జీఎస్‌టీ కౌన్సిల్

గాల్లో చక్కర్లు కొట్టిన సింగపూర్‌ ఇండిగో ఫ్లైట్.. అరగంట తర్వాత..

Read Latest AP News And Telugu News

Updated Date - Jan 03 , 2026 | 01:48 PM