World Telugu Conference: శ్రీనివాస కల్యాణంతో మహాసభలకు శ్రీకారం
ABN , Publish Date - Jan 03 , 2026 | 10:36 AM
మూడవ ప్రపంచ తెలుగు మహాసభలకు అంకురార్పణ జరిగింది. ఆంధ్ర సారస్వత పరిషత్ ఆధ్వర్యంలో తెలుగు మహాసభలకు ఏర్పాట్లు జరిగాయి.
గుంటూరు, జనవరి 3: మూడవ ప్రపంచ తెలుగు మహాసభలకు (World Telugu Conference) అంకురార్పణ జరిగింది. ఈరోజు (శనివారం) ఉదయం శ్రీనివాస కల్యాణ కార్యక్రమంతో తెలుగు మహాసభలకు శ్రీకారం చుట్టారు. ఈ వేడుకలో ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ అయ్యన్నపాత్రుడు (AP Assembly Speaker Ayyannapatrudu) పాల్గొన్నారు. ఇక నేటి నుంచి ఈనెల 5 వరకు మూడో ప్రపంచ తెలుగు మహాసభల కార్యక్రమాలు జరుగనున్నాయి. ఆంధ్ర సారస్వత పరిషత్ ఆధ్వర్యంలో గుంటూరు శివారులోని శ్రీసత్యసాయి ఆధ్యాత్మిక కేంద్రంలో ప్రపంచ తెలుగు మహాసభలు జరుగుతున్నాయి.
ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా పలువురికి పురస్కారాలను అందజేయనున్నారు. ఐదు సువిశాల వేదికల్లో ప్రపంచ తెలుగు మహాసభల కార్యక్రమాలు జరుగనున్నాయి. ప్రపంచ తెలుగు మహాసభలకు ఈరోజు ఒడిశా గవర్నర్ కంభంపాటి హాజరుకానున్నారు. రేపు (ఆదివారం) ప్రపంచ తెలుగు మహాసభల్లో మారిషస్ అధ్యక్షుడు ధరమ్ గోకుల్ పాల్గొననున్నారు. ప్రపంచ తెలుగు మహాసభలకు ఒక దేశాధ్యక్షుడు రావడం ఇదే ప్రథమం. ఇక సోమవారం నాడు జరిగే మహాసభల్లో సీఎం చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu), మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు (Former Vice President Venkaiah Naidu) పాల్గొననున్నారు. ప్రముఖుల హాజరుతో ప్రపంచ తెలుగు మహాసభలు మరింత వైభవంగా సాగనున్నాయి.
ఇవి కూడా చదవండి...
ఎయిర్, వాటర్ ప్యూరిఫయ్యర్స్‌పై పన్ను కోత.. యోచనలో జీఎస్‌టీ కౌన్సిల్
గాల్లో చక్కర్లు కొట్టిన సింగపూర్ ఇండిగో ఫ్లైట్.. అరగంట తర్వాత..
Read Latest AP News And Telugu News