Home » Venkaiah Naidu
ప్రపంచం నేడు ఎదుర్కొంటున్న అనేక సవాళ్లకు భారతీయ తత్వచింతనే పరిష్కారమని మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు అన్నారు.
కాస్మాలజీ, మెటా ఫిజిక్స్ వంటి శాస్త్రాలు కూడా మన తత్వాల్లో ఉన్నాయని భారత ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు చెప్పారు. ఆచార్య నాగార్జునుడు, ఆది శంకరాచార్యులు తాత్వికతను ప్రముఖంగా చెప్పారని గుర్తుచేశారు. వేమన శతకం చదివితే అద్భుతమైన ప్రాపంచిక చింతన అలవడుతుందని తెలిపారు.
Telangana: ఖైరతాబాద్ మహా గణనాధునికి ఆరో రోజు పూజలు కొనసాగుతున్నాయి. శ్రీ సప్తముక మహాగణపతికి ఆరో రోజు భక్తులు అధిక సంఖ్యలో వచ్చి దర్శనం చేసుకుంటున్నారు. ఈరోజు (గురువారం) ఖైరతాబాద్ ఉత్సవాలకుమాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు హాజరయ్యారు. వెంకయ్య నాయుడితో ఉత్సవ సమితి సభ్యులు ప్రత్యేక పూజలు చేయించారు.
తెలుగు రాష్ర్టాల్లో వరద కష్టాలపై మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు తీవ్ర విచారం వ్యక్తం చేశారు.
తెలుగు రాష్ట్రాల్లో వరద కష్టాలపై భారత మాజీ ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు విచారం వ్యక్తం చేశారు. తనకు వచ్చే పెన్షన్ నుంచి రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సహాయ నిధికి విరాళం ప్రకటించారు. తన కుమారుడు, కుమార్తె తరఫున కూడా విరాళం ప్రకటించారాయన.
తెలుగు భాష చాలా ప్రాచీనమైనదని, దీని ప్రాచీనతను మనందరం కాపాడుకోవాలని మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు. తొలి తెలుగు శాసనాలున్న కలమల్లలో గురువారం జరిగిన తెలుగుభాషా దినోత్సవానికి అయన ముఖ్యఅతిథిగా విచ్చేశారు.
Telangana: ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు శ్రీ టంగుటూరి ప్రకాశం పంతులు 153 వ జయంతి నేడు. ఈ సందర్భంగా మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు నివాళులర్పించారు. అసంబ్లీ ముందున్న ప్రకాశం పంతులు విగ్రహానికి వెంకయ్య, వివిధ పార్టీలకు చెందిన పలువురు నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ విషయాన్ని వెంకయ్య ఎక్స్ వేదికగా పంచుకున్నారు.
స్వాతంత్య్ర సమరయోధులు కలలు కన్న వికసిత్ భారత్ నిర్మాణంలో యువతరం భాగస్వామి కావాలని భారత మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు పిలుపునిచ్చారు.
ప్రధానమంత్రి నరేంద్రమోదీ నాయకత్వంలో భారతదేశం బలోపేతం అవుతుందని భారత మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు వ్యాఖ్యానించారు. దేశంలో కుల మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ గౌరవంగా బతకాలని భారత తెలిపారు.
మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు మంచి భోజన ప్రియుడు. పలు సందర్భాల్లో ఆయనే ఈ విషయం చెప్పారు. విజయవాడలో మండవాస్ హోటల్ చాలా ఫేమస్. వెంకయ్య నాయుడు బుధవారం మండవాస్ హోటల్ వచ్చారు. హోటల్ యజమాని మండవ వెంకట రత్నం సాదరంగా స్వాగతం పలికారు. హోటల్లో తెలుగు వంటకాల రుచిని వెంకయ్య నాయుడు చూశారు.