Share News

Vijayawada Utsav: 'విజయవాడ ఉత్సవ్ 2025'ను ప్రారంభించిన వెంకయ్య నాయుడు, లోకేష్

ABN , Publish Date - Sep 22 , 2025 | 08:45 PM

విజయవాడ చరిత్రలో మొట్టమొదటి సారిగా గ్రాండ్‌వేలో విజయవాడ ఉత్సవ్ 2025 నిర్వహిస్తున్నారు. ఈ పండుగను మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, మంత్రి నారా లోకేష్ ఇవాళ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఇరువురు అనేక విషయాల్ని పంచుకున్నారు.

Vijayawada Utsav: 'విజయవాడ ఉత్సవ్ 2025'ను ప్రారంభించిన వెంకయ్య నాయుడు, లోకేష్
Vijayawada Utsav

విజయవాడ, సెప్టెంబర్ 22: విజయవాడ పేరులోనే విజయం ఉందని, చరిత్ర రాయాలన్నా, సృష్టించాలన్నా విజయవాడతోనే సాధ్యమని ఏపీ మంత్రి నారా లోకేష్ అన్నారు. తెలుగు భాషాభివృద్ధికి మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఎనలేని కృషి చేశారని లోకేష్ చెప్పారు. జీవోలన్నీ తెలుగులో వస్తున్నాయంటే అది వెంకయ్య నాయుడితోనే సాధ్యమైందని చెప్పారు. 'వెంకయ్య నాయుడు ఏజ్.. ఆయనకు ఒక నంబర్ మాత్రమే. ముఖ్యమంత్రి చంద్రబాబు, వెంకయ్య నాయుడు గార్లతో పోటీ పడలేకపోతున్నా' అని లోకేష్ చెప్పుకొచ్చారు. ఇవాళ (సోమవారం) వెంకయ్యనాయుడుతో కలిసి విజయవాడ ఉత్సవ్ 2025ను లోకేష్ ప్రారంభించారు.


ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ.. 'లండన్ లో వండర్ కార్నివాల్ బాగా ప్రసిద్ధి. అమరావతి పనులు వేగంగా జరుగుతున్నాయి. ఎంపీ కేశినేని చిన్ని కలిసి విజయవాడ ఉత్సవ్ నిర్వహిస్తామని చెప్పినప్పుడు ఆశ్చర్యానికి గురయ్యా. మెగా DSC సభ కూడా ఈనెల 25న ఘనంగా నిర్వహిస్తాం' అని లోకేష్ తెలిపారు. ఈ మేరకు విజయవాడలో సొసైటీ ఫర్ వైబ్రెంట్ విజయవాడ ఆధ్వర్యంలో విజయవాడ ఉత్సవాలను మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, మంత్రి నారా లోకేష్ కలిసి ప్రారంభించారు. విజయవాడకు విశిష్ట సేవలు అందించిన పుర ప్రముఖులను వెంకయ్య నాయుడు, లోకేష్ సన్మానించారు.

Naralokesh.jpg


కాగా, విజయవాడ ఉత్సవ్ కు సంబంధించి 3 వేల మంది కళాకారులతో అతిపెద్ద కార్నివాల్ అక్టోబర్ రెండో తేదీన ఉండబోతుంది. 11 రోజులపాటు విజయవాడ వైభవాన్ని తెలిపే విధంగా డ్రోన్ షో సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్ గా నిలుస్తుంది. పారా గ్లైడింగ్, హెలిరైడ్, లాంటి ఎంటర్టైన్మెంట్ ఈవెంట్స్ నిర్వహిస్తున్నారు. మైసూర్ దసరా ఉత్సవాలకు ధీటుగా విజయవాడ ఉత్సవాలు జరగాలని ఏపీ సర్కారు పట్టుదలతో ఉంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన క్రాకర్స్ షో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.


ఈ వార్తలు కూడా చదవండి..

ఆ మార్పులతో ముందుగానే దసరా: బీజేపీ

ఎన్టీటీపీఎస్ కాలుష్యంపై మంత్రి గొట్టిపాటి కీలక వ్యాఖ్యలు

Read Latest AP News And Telugu News

Updated Date - Sep 22 , 2025 | 10:03 PM