Venkaiah Naidu: పార్టీ మారితే పదవికి రాజీనామా చేయాలి..
ABN , Publish Date - Oct 07 , 2025 | 01:17 PM
ప్రజాప్రతినిధులు పార్టీ మారితే.. ఆ పార్టీ ద్వారా పొందిన పదవికి రాజీనామా చేయాలని వెంకయ్యనాయుడు తెలిపారు. రాజ్యాంగంలో 10వ షెడ్యూల్‌ని సవరించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.
నెల్లూరు: భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్‌పై జరిగిన దాడి యత్నాన్ని మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు ఖండించారు. దాడికి ప్రయత్నం చేసిన వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఇది ఛీఫ్ జస్టిస్‌కి సంబంధించిన అంశం కాదు, సమాజానికి, వ్యవస్థకి సంబంధించిన విషయమని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.
ప్రజాప్రతినిధులు పార్టీ మారితే.. ఆ పార్టీ ద్వారా పొందిన పదవికి రాజీనామా చేయాలని వెంకయ్యనాయుడు తెలిపారు. రాజ్యాంగంలో 10వ షెడ్యూల్‌ని సవరించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. పార్టీ మారి మంత్రులు అవుతున్నారని ఆరోపించారు. చట్టానికి అతీతంగా ఎవరూ వ్యవహారించకూడదని సూచించారు. ప్రజలకి అందించే ఉచితాలు పరిధులు దాటుతున్నాయని వివరించారు. ప్రభుత్వాలు తాహతుకు మించి అప్పులు చేస్తున్నాయని చెప్పారు. ప్రభుత్వాలు అప్పులు తెచ్చేటప్పుడు, ఎలా తీరుస్తారో ప్రణాళికలు అసెంబ్లీలో చర్చించాలని ఆయన కోరారు.
చట్టసభల్లో కుటుంబ సభ్యులని దూషించడం సరికాదని వెంకయ్యనాయుడు హితవు పలికారు. అలాంటి వారిపై చట్టాన్ని ప్రయోగించి, చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థ మన దేశంలోనే ఉందని గుర్తుచేశారు. మనదేశ కీర్తిని ప్రతి ఒక్కరూ చాటాలని పిలుపునిచ్చారు. ప్రజాప్రతినిధుల క్రిమినల్ కేసులుపై రెండేళ్లలోపే విచారణ జరగాలని చెప్పారు. ప్రభుత్వాలు కోర్టుల సంఖ్యలు పెంచి, జడ్జీలని నియమించాలని కోరారు. రాజకీయ వారసత్వానికి తాను వ్యతిరేకమని వెంకయ్య నాయుడు స్పష్టం చేశారు.
ఇవి కూడా చదవండి..
ఎన్నికల ప్రక్రియ సరళం.. శాంతిభద్రతలపై డేగకన్ను
బిహార్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల, జూబ్లీహిల్స్ బైపోల్ కూడా..