Share News

Bihar Assembly Elections 2025: ఎన్నికల ప్రక్రియ సరళం.. శాంతిభద్రతలపై డేగకన్ను

ABN , Publish Date - Oct 06 , 2025 | 04:47 PM

243 మంది సభ్యుల ప్రస్తుత అసెంబ్లీ గడువు నవంబర్ 22వ తేదీతో ముగియనుంది. ఈసారి కూడా ప్రధాన పోటీ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ సారథ్యంలోని ఎన్డీయే, ఆర్జేడీ తేజస్వి సారథ్యంలోని మహా ఘట్ బంధన్ మధ్యనే ఉంది.

Bihar Assembly Elections 2025: ఎన్నికల ప్రక్రియ సరళం.. శాంతిభద్రతలపై డేగకన్ను
Bihar Assembly Elections

న్యూఢిల్లీ: బిహార్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను ఎన్నికల సంఘం (ECI) ప్రకటించింది. ఈసారి ఎన్నికల ప్రక్రియ మరింత సరళంగా ఉంటుందని చెప్పింది. శాంతిభద్రతలపై పూర్తి దృష్టి పెట్టామని తెలిపింది. న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సీఈసీ జ్ఞానేష్ కమార్ (Gyanesh Kumar) మాట్లాడుతూ, రెండు దశల్లో పోలింగ్ జరుగుతుందని చెప్పారు. నవంబర్ 6న తొలి విడత పోలింగ్, నవంబర్ 11న రెండో విడత పోలింగ్ నిర్వహిస్తామని చెప్పారు. నవంబర్ 14న కౌంటింగ్ జరుగుతుందని తెలిపారు. నవంబర్ 22 లోపు ఎన్నికల ప్రక్రియ పూర్తి చేస్తామన్నారు. రాష్ట్రంలో మొత్తం 7.24 కోట్ల మంది ఓటర్లు ఉండగా, వీరిలో 3 కోట్ల 92 లక్షల మంది పురుష ఓటర్లు, 3 కోట్ల 50 లక్షల మంది మహిళా ఓటర్లు ఉన్నట్టు వివరించారు.


ఓటర్ల జాబితాలో సవరణలకు ఇంకా అవకాశం ఉందని, నామినేషన్లకు 10 రోజుల ముందు కూడా ఓటర్ జాబితాలో మార్పులు చోసుకోవచ్చని తెలిపారు. ఎన్నికల కోసం 90,712 పోలింగ్ స్టేషన్లు, ప్రతి పోలింగ్ స్టేషన్‌లోనూ వెబ్‌క్యాస్టింగ్ ఏర్పాటు చేసినట్టు చెప్పారు. అలాగే ప్రతి పోలింగ్ స్టేషన్‌లోనూ మొబైల్ డిపాజిట్ సౌకర్యం కల్పిస్తామన్నారు. ఎన్నికల్లో హింసను, ఓటర్లు, అభ్యర్థులను బెదిరించడాన్ని ఏమాత్రం సహించేది లేదని, ఈ మేరకు ప్రభుత్వ యంత్రాంగానికి కఠిన ఆదేశాలిచ్చామని చెప్పారు. సోషల్ మీడియా, ఇతర వేదికలపై నకలీ వార్తలపై కఠినంగా వ్యవహరిస్తామన్నారు.


243 మంది సభ్యుల ప్రస్తుత అసెంబ్లీ గడువు నవంబర్ 22వ తేదీతో ముగియనుంది. ఈసారి కూడా ప్రధాన పోటీ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ సారథ్యంలోని ఎన్డీయే, ఆర్జేడీ తేజస్వి సారథ్యంలోని మహా ఘట్ బంధన్ మధ్యనే ఉంది.


ఇవి కూడా చదవండి..

సుప్రీంకోర్టులో అనూహ్య ఘటన.. సీజేఐపై చెప్పుతో దాడికి లాయర్ యత్నం

జైపూర్ ప్రమాదంపై అమిత్ షా విచారం, సిబ్బంది నిర్లక్ష్యం వల్లేనని బాధితుల మండిపాటు

Read Latest Telangana News and National News

Updated Date - Oct 06 , 2025 | 05:23 PM