Share News

Vijayawada Utsav 2025: విజయవాడ ఉత్సవ్ ప్రారంభించిన మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు

ABN , Publish Date - Sep 22 , 2025 | 09:18 PM

'విజయవాడ ఉత్సవ్ 2025'ను మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వెంకయ్య నాయుడు అనేక విషయాల్ని పంచుకున్నారు. రాజధాని విజయవంతం కావాలంటే ఎడ్యుకేషన్, ఎంటర్ టైన్ మెంట్ అవసరమని..

Vijayawada Utsav 2025: విజయవాడ ఉత్సవ్ ప్రారంభించిన మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు
Former Vice President M Venkaiah Naidu

విజయవాడ, సెప్టెంబర్ 22: విజయవాడ ఉత్సవ్-2025లో పాల్గొనడం సంతోషంగా ఉందని మాజీ ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్య నాయుడు అన్నారు. ఈ ఉత్సవ్ తో విజయవాడకు నూతన శోభ సంతరించుకుందని చెప్పారు. 'విజయవాడ ఉత్సవ్ 2025 ద్వారా విజయవాడ గొప్పతనాన్ని ప్రపంచానికి చాటి చెబుతున్నారు. మంచి చేసే వారిని ఎప్పుడూ గౌరవించాలి. రాజధాని విజయవంతం కావాలంటే ఎడ్యుకేషన్, ఎంటర్ టైన్ మెంట్ అవసరం. విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం రాబోయే రోజుల్లో మరింత అభివృద్ధి చెందుతుంది' అని వెంకయ్య నాయుడు చెప్పారు.


ఇంకా మాజీ ఉప రాష్ట్రపతి ఏమన్నారంటే.. 'కుటుంబ వ్యవస్థ ప్రస్తుతం ఛిన్నాభిన్నం అవుతోంది. వంట విడిపోతే జంట‌ విడిపోద్ది.. వంటను కాపాడుకోండి. భాష పోతే.. శ్వాస పోయినట్టే.. అందరూ మాతృ భాషను కాపాడుకోవాలి. ప్రభుత్వ ఉత్తర్వులు తెలుగులో ఇవ్వాలని చంద్రబాబును కోరా.. ఇవాళ తెలుగులో ఇచ్చారు సంతోషం. ప్రైవేట్ వ్యక్తులు ముందుకొచ్చి విజయవాడ ఉత్సవ్ నిర్వహించడం మంచి పరిణామం. ఫాస్ట్ లైఫ్, ఫాస్ట్ ఫుడ్ కు అలవాటు పడిపోయారు. అది మంచిది కాదు. విజయవాడ ఉత్సవ్ సక్సెస్ కావాలంటే అందరూ కష్టపడి పనిచేయాలి' అని వెంకయ్య నాయుడు అన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

ఆ మార్పులతో ముందుగానే దసరా: బీజేపీ

ఎన్టీటీపీఎస్ కాలుష్యంపై మంత్రి గొట్టిపాటి కీలక వ్యాఖ్యలు

Read Latest AP News And Telugu News

Updated Date - Sep 22 , 2025 | 10:12 PM