Visakhapatnam: అరకులోయలో దారుణం.. ఆస్పత్రి బాత్రూమ్‌లో మృత శిశువు కలకలం
ABN , Publish Date - Jan 03 , 2026 | 01:38 PM
అరకులోయ ఏరియా ఆసుపత్రిలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. లేడీస్ బాత్‌రూమ్‌లో ఒక నవ జాతి శిశువు మృతదేహం తీవ్ర కలకలం రేపింది.
విశాఖపట్నం జిల్లా: అరకులోయ ఏరియా ఆసుపత్రిలో అమానవీయ ఘటన చోటు చేసుకుంది. ప్రభుత్వాసుపత్రిలోని లేడీస్ బాత్‌రూమ్‌లో ఒక నవ జాతి శిశువు మృదేహం తీవ్ర కలకలం రేపింది. గుర్తు తెలియని మహిళ మృత శిశువుకు జన్మనిచ్చిందా లేదా ప్రసవం తర్వాత చనిపోయిందా అన్నదానిపై స్పష్టత రావాల్సి ఉంది. బాత్ రూమ్ క్లీన్ చేయడానికి వెళ్లిన కార్మికురాలు శిశువును చూసి కేకలు వేయడంతో విషయం బయటకు వచ్చింది. వెంటనే ఆసుపత్రి సూపరింటెండెంట్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
అరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. ఆసుపత్రి ఎంట్రెన్స్, చుట్టుపక్కల ప్రదేశాల్లో సీసీటీవీ కెమెరాలు పరిశిస్తున్నారు పోలీసులు. శనివారం ఉదయం ఆసుపత్రికి వచ్చిన గర్భిణి ఎవరు? ఓపీ (OP)రిజిస్ట్రార్ లో ఎవరు నమోదు చేసుకున్నారు అనే కోణంలో రికార్డులను తనిఖీ చేస్తున్నారు. సదరు గర్భిణి బాత్ రూమ్ కి వెళ్లి అక్కడే ప్రసవించినట్లు సమాచారం. శిశువు మరణించడంతో ఆందోళనకు గురై వదిలేసి పరారైనట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
ఇవి కూడా చదవండి...
ఎయిర్, వాటర్ ప్యూరిఫయ్యర్స్‌పై పన్ను కోత.. యోచనలో జీఎస్‌టీ కౌన్సిల్
గాల్లో చక్కర్లు కొట్టిన సింగపూర్ ఇండిగో ఫ్లైట్.. అరగంట తర్వాత..