నంద్యాల విజయ డెయిరీ ముగ్గురు డైరెక్టర్ల ఎన్నికలో ట్విస్ట్
ABN , Publish Date - Jan 23 , 2026 | 11:23 AM
శాంతి భద్రతల దృష్ట్యా ఎన్నికలను వాయిదా వేయాలని పోలీసులు అంటుండటంతో నంద్యాల విజయ డెయిరీకి సంబంధించిన మూడు డైరెక్టర్ల ఎన్నికల విషయంలో గందరగోళం ఏర్పడింది. ఈ క్రమంలో ఎన్నికల నామినేషన్ ప్రక్రియపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
కర్నూలు జిల్లా, జనవరి 23: నంద్యాల విజయ డెయిరీకి సంబంధించిన మూడు డైరెక్టర్ల ఎన్నికలో ట్విస్ట్ చోటుచేసుకుంది. శాంతి భద్రతల దృష్ట్యా ఎన్నికలను వాయిదా వేయాలని పోలీసులు అంటున్నారు. అయితే శాంతినగరం సొసైటీ అధ్యక్షురాలు గంగుల ప్రమీల రాణి నామినేషన్ వేసేందుకు వచ్చారు. ఎన్నికలు వాయిదా వేస్తున్నారని తెలియడంతో ఆమె డెయిరీ వద్దే కూర్చుండి పోయారు. ఎన్నికలు జరపకుండా ఆలస్యం చేయడంపై సమాధానం చెప్పాలని ఆమె ప్రశ్నిస్తున్నారు. కోర్టు ఆదేశాలు లేనిదే నామినేషన్ ప్రక్రియ వాయిదా వేయడం కుదరదని ఎన్నికల అధికారి హరిబాబు అంటున్నారు.
కాగా.. ఈ రోజు(శుక్రవారం) మూడు డైరెక్టర్ల పదవులకు సంబంధించి నామినేషన్ల స్వీకరణతో పాటు పరిశీలన కూడా జరగాల్సి ఉంది. విజయ డెయిరీలోని మేనేజింగ్ డైరెక్టర్ పరిపాలన భవన్‌లో ఉదయం 9:00 గంటల నుంచి మధ్యాహ్నం 2:00 గంటల వరకు నామినేషన్ దాఖలు.. ఆ తర్వాత 3:00 గంటలకు పరిశీలన పక్రియ జరగాల్సి ఉండింది. శాంతి భద్రతల దృష్ట్యా ఎన్నికలను వాయిదా వేయాలని పోలీసులు అంటుండటంతో గందరగోళం నెలకొంది. ఈ క్రమంలో ఎన్నికల నామినేషన్ ప్రక్రియపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. సజావుగా ఎన్నికల ప్రక్రియ సాగుతుందా? లేక వాయిదా పడుతుందా.? అనే సందేహాలు నెలకొన్నాయి.
ఇవి కూడా చదవండి
ఏ అక్రమాలకు పాల్పడలేదు.. మానసిక క్షోభకు గురిచేశారు: కేటీఆర్
పండుగ రోజు యజమానికి షాక్.. ఎగిరిపోయిన రూ.80వేల చిలుక