Share News

శ్రీశైలం టోల్‌గేట్‌ వద్ద భారీగా నగదు పట్టివేత

ABN , Publish Date - Jan 27 , 2026 | 02:41 PM

శ్రీశైలం టోల్‌గేట్‌ వద్ద భారీగా నగదు పట్టుబడింది. టోల్‌గేట్ సిబ్బంది తనిఖీలు నిర్వహించగా ఓ కారులో రూ.30 లక్షల నగదు లభ్యమైంది.

శ్రీశైలం టోల్‌గేట్‌ వద్ద భారీగా నగదు పట్టివేత
Srisailam Toll Gate

నంద్యాల, జనవరి 27: శ్రీశైలం టోల్‌గేట్(Srisailam Tollgate) వద్ద భారీగా నగదు పట్టుబడటం కలకలం రేపుతోంది. దేవస్థానం సెక్యూరిటీ సిబ్బంది నిర్వహించిన వాహనాల తనిఖీల్లో మహారాష్ట్రకు చెందిన ఓ వాహనంలో రూ.30 లక్షల నగదును గుర్తించారు అధికారులు. టోల్‌గేట్ వద్ద జరిగిన సోదాల్లో ఈ వాహనాన్ని ఆపి సెక్యూరిటీ సిబ్బంది వివరాలు ఆరా తీయగా.. కారు సీట్ కింద ఉన్న బ్యాగులో భారీ మొత్తంలో నోట్ల కట్టలు లభించాయి. నగదుపై కారులోని వ్యక్తులు పొంతనలేని సమాధానాలు చెప్పినట్లు తెలుస్తోంది. ఆ నగదుకు సంబంధించి సరైన పత్రాలనూ చూపలేకపోయారు.


కారును, నగదును స్వాధీనం చేసుకున్న శ్రీశైలం పోలీసులు.. విచారణ చేపట్టారు. ఈ డబ్బును ఎక్కడి నుంచి తీసుకువస్తున్నారు? ఎందు కోసం తీసుకొచ్చారనే అనే దానిపై పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. తనిఖీలలో బయటపడిన నగదు వివరాలను ఆదాయపు పన్ను శాఖకు(ఇన్‌కమ్ టాక్స్) పంపారు అక్కడి అధికారులు.


ఇవి కూడా చదవండి..

ఎన్టీఆర్ భవన్‌లో పార్లమెంటరీ కమిటీల శిక్షణ.. ప్రధానంగా వాటిపైనే

సీఐ కనకారావుకు ప్రశంసా పత్రం.. తీవ్ర విమర్శలు

Read Latest AP News And Telugu News

Updated Date - Jan 27 , 2026 | 03:34 PM