Share News

ఎన్టీఆర్ భవన్‌లో పార్లమెంటరీ కమిటీల శిక్షణ.. ప్రధానంగా వాటిపైనే

ABN , Publish Date - Jan 27 , 2026 | 11:13 AM

పార్లమెంటరీ కమిటీలకు శిక్షణ తరగతులను మంత్రి నారా లోకేశ్ ప్రారంభించారు. పార్లమెంటరీ కమిటీలను స్వయంగా ఆహ్వానించిన మంత్రి.. ప్రతి సభ్యుడితోనూ ఫొటోలు దిగారు.

ఎన్టీఆర్ భవన్‌లో పార్లమెంటరీ కమిటీల శిక్షణ.. ప్రధానంగా వాటిపైనే
Minister Nara Lokesh

అమరావతి, జనవరి 27: తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్‌లో పార్లమెంటరీ కమిటీలకు శిక్షణ తరగతులు ప్రారంభమయ్యాయి. మంగళవారం ఉదయం జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేశ్‌(Minister Nara Lokesh) ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. ఉదయాన్నే ఎన్టీఆర్ భవన్‌కు చేరుకున్న లోకేశ్.. పార్లమెంటరీ కమిటీ సభ్యులను స్వయంగా ఆహ్వానించారు. ప్రతి సభ్యుడితో దాదాపు రెండు గంటల పాటు ఓపికగా ఫొటోలు దిగారు. ఆ తర్వాత ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించి శిక్షణ తరగతులను ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు(TDP AP Chief Palla Srinivasrao) కూడా హాజరయ్యారు.


ఈ కార్యక్రమంలో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ ఛైర్మన్‌లు తదితర ప్రముఖ నేతలు పాల్గొన్నారు. మధ్యాహ్నం సచివాలయ కార్యక్రమాలను రద్దు చేసుకుని సీఎం చంద్రబాబు నాయుడు(CM Chandrababu Naidu) పార్టీ కార్యాలయానికి చేరుకోనున్నారు. పార్టీ లక్ష్యాలు, నాయకత్వ లక్షణాలు, తాజా రాజకీయ పరిణామాలపై సీనియర్ నేతలు క్లాసులు నిర్వహించనున్నారు. సాయంత్రం వరకు పార్టీ సీనియర్ నేతలు పార్లమెంటరీ కమిటీలకు శిక్షణ ఇవ్వనున్నారు. ముగింపు సమావేశంలో కమిటీలకు ముఖ్యమంత్రి చంద్రబాబు దిశానిర్దేశం చేయనున్నారు.


ఇవి కూడా చదవండి..

బొబ్బిలి సమీపంలో గజరాజుల స్వైరవిహారం

యువగళానికి మూడేళ్లు.. లోకేశ్‌కు పలువురు నేతల శుభాకాంక్షలు

Read Latest AP News And Telugu News

Updated Date - Jan 27 , 2026 | 11:35 AM