బొబ్బిలి సమీపంలో గజరాజుల స్వైరవిహారం
ABN , Publish Date - Jan 27 , 2026 | 05:13 AM
విజయనగరం జిల్లా బొబ్బిలి పట్టణానికి రెండు కిలోమీటర్ల దూరంలో ఏనుగులు స్వైరవిహారం చేస్తున్నాయి.
పంటలు, ధాన్యం ధ్వంసం.. జనం బెంబేలు
బొబ్బిలి, జనవరి 26 (ఆంధ్రజ్యోతి): విజయనగరం జిల్లా బొబ్బిలి పట్టణానికి రెండు కిలోమీటర్ల దూరంలో ఏనుగులు స్వైరవిహారం చేస్తున్నాయి. దిబ్బగుడ్డివలస, రాజుపేట, సీతయ్యపేట గ్రామాల పరిధిలో సంచరిస్తున్నాయి. పిల్ల ఏనుగులతో కలిపి 8 ఏనుగులు పొరుగున ఉన్న పార్వతీపురం మన్యం జిల్లా సీతానగరం, మక్కువ మండలాల సరిహద్దు నుంచి బొబ్బిలి పట్టణ సమీపానికి వచ్చేశాయి. మూడు రోజులుగా మొక్కజొన్న పంటను, రైతులు కళ్లాల్లో నిల్వచేసిన ధాన్యం బస్తాలను ధ్వంసం చేస్తుండడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏనుగులకు ఆహారం దొరకకపోవడం, విశాఖ-రాయపూర్ వెళ్లే రైళ్ల రాకపోకల శబ్దాలతో ఏనుగులు ఇక్కడి నుంచి కదలడం లేదని అటవీ అధికారులు తెలిపారు.