Share News

Nandyal: శ్రీశైలం టోల్ గేట్ వద్ద మద్యం పట్టివేత

ABN , Publish Date - Jan 02 , 2026 | 09:04 AM

ఈ మధ్య కాలంలో కొంతమంది ఈజీ మనీ కోసం పలు నేరాలకు పాల్పపడుతున్నారు. ఈ క్రమంలోనే నంద్యాల జిల్లాలో అక్రమంగా మద్యం సరఫరా చేస్తున్న బ్యాచ్‌ని పోలీసులు పట్టుకున్నారు.

Nandyal: శ్రీశైలం టోల్ గేట్ వద్ద మద్యం పట్టివేత
Nandyal illegal liquor

నంద్యాల జిల్లా: ఇటీవల జిల్లా వ్యాప్తంగా అక్రమ మద్యం తరలిస్తు్న్న వారికి చుక్కలు చూపిస్తు్న్నారు పోలీసులు. వాహనాల తనిఖీల్లో భాగంగా ఆత్మకూర్ మండలానికి చెందిన ఇద్దరు వ్యక్తులు మోటర్ సైకిల్‌పై 47 క్వార్టర్ బాటిళ్లను అక్రమంగా తరలించే ప్రయత్నం చేయగా పోలీసులు వారిని పట్టుకున్నారు. మద్యం బాటిళ్లను సీజ్ చేశామని పోలీసులు తెలిపారు. అక్రమంగా మద్యం బాటిళ్లను తరలిస్తున్న మాండ్ల కొలను భరత్, గొల్ల మాసయ్యలను అరెస్టు చేశామన్నారు. సదరు వ్యక్తులు ఆత్మకూర్ లో మద్యం బాటిళ్లు కొనుగోలు చేసి శ్రీశైలంలో ఎక్కువ రేటుకు అమ్మేందుకు ప్లాన్ చేసినట్లుగా సీఐ జీవన్ గంగనాధబాబు తెలిపారు. ఈజీ మనీ కోసం కొంతమంది ఈ పద్దతిని ఎంచుకుంటున్నారని, మద్యం అక్రమనికి పోలీసులు అడ్డు కట్ట వేస్తు్న్నామన్నారు.


ఇదిలా ఉంటే.. శ్రీశైలం పాతాళగంగ మెట్ల మార్గంలో అర్ధరాత్రి చిరుత కలకలం రేపింది. సీసీటీవీ కెమెరాలో పులి సంచరించిన దృశ్యాలు రికార్డయ్యాయి. పుణ్యస్నానాలకు వెళ్లే భక్తులు, స్థానికులు జాగ్రత్తలు పాటించాలని మైకుల ద్వారా అనౌన్స్ చేయించారు అధికారులు. గతంలోనూ ఈ ప్రాంతంలో పులి సంచరించిందని, ప్రజలు ఎట్టి పరిస్థితుల్లో రాత్రి పూట బయటకు రావొద్దని, అప్రమత్తంగా ఉండాలని ఈఓ శ్రీనివాసరావు, చైర్మన్ రమేష్ నాయుడు విజ్ఞప్తి చేశారు. కోసిగి మండలం గౌడుగల్లు సమీపంలో కొండల్లో రెండు చిరుతలు సంచరిస్తున్నట్లు అక్కడ ఉన్న గొర్రెల కాపర్లు చెబుతున్నారు. ఈ మేరకు గ్రామస్థులు, గొర్ల కాపర్లు అప్రమత్తంగా ఉండాలని అధికారులు చెబుతున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

గాలి జనార్దన్‌రెడ్డిపై హత్యాయత్నం

మరో 3.5 కిలోల బంగారం రికవరీ

Updated Date - Jan 02 , 2026 | 09:41 AM