Asif Arrest: ‘పాకిస్థాన్ జిందాబాద్’ అంటూ నినాదాలు చేసిన యువకుడు అరెస్ట్
ABN , Publish Date - Dec 19 , 2025 | 08:44 AM
శ్రీ సత్యసాయి జిల్లా దేవరెడ్డిపల్లికి చెందిన ధనుంజయ అలియాస్ ఆసిఫ్ ఇటీవల పాకిస్థాన్ అనుకూల నినాదాలతో సంచలనం రేపాడు. అతను ‘ఐ లవ్ పాకిస్థాన్, పాకిస్థాన్ జిందాబాద్’ అంటూ నినాదాలు చేశాడు.
శ్రీ సత్యసాయి జిల్లా, డిసెంబరు19 (ఆంధ్రజ్యోతి): శ్రీ సత్యసాయి జిల్లా (Sri Sathya Sai District) దేవరెడ్డిపల్లికి చెందిన ధనుంజయ అలియాస్ ఆసిఫ్ ఇటీవల పాకిస్థాన్ అనుకూల నినాదాలతో సంచలనం రేపాడు. ఆయన ‘ఐ లవ్ పాకిస్థాన్, పాకిస్థాన్ జిందాబాద్’ అంటూ నినాదాలు చేశాడు. ఈ వీడియో వైరల్ కావడంతో నల్లచెరువు పోలీసులు ఆసిఫ్‌పై కేసు నమోదు చేసి రిమాండ్‌కు పంపించారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను నల్లచెరువు పోలీసులు ఇవాళ(శుక్రవారం) మీడియాకు వెల్లడించారు.
ప్రేమ కోసం ఆయన ఇస్లాం మతంలోకి మారాడు. గోర్లవాండ్లపల్లికి చెందిన ముస్లిం యువతిని ధనుంజయ ప్రేమించాడు. ఈ క్రమంలోనే మతం మారితే ముస్లిం యువతి తల్లిదండ్రులు తమ పెళ్లికి అంగీకరిస్తారని భావించాడు. ఈ క్రమంలో ధనుంజయ అలియాస్ ఆసిఫ్ ఇస్లాం మతం స్వీకరించాడు. కర్ణాటక రాష్ట్రం బెంగళూరు వెళ్లడానికి ఓ కారు బుక్ చేశాడు. ఈ క్రమంలోనే తిరుపతికి చెందిన ప్రసన్నకుమార్ రెడ్డి వద్ద కారు అద్దెకు తీసుకున్నాడు.
కారును రూ.15 వేల అద్దెకు ఆసిఫ్ మాట్లాడుకున్నాడు. అయితే కర్ణాటక రాష్ట్రం బెంగళూరు వైట్ ఫీల్డ్ సమీపంలో ఆయన దిగాడు. కారు దిగిన తర్వాత ఆసిఫ్‌ను ప్రసన్నకుమార్ రెడ్డి పైసలు ఇవ్వాలని అడిగాడు. నగదు ఇవ్వకపోవడంతో ప్రసన్నకుమార్ రెడ్డి, ఆసిఫ్‌ల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ నేపథ్యంలోనే ‘ఐ లవ్ పాకిస్థాన్ - పాకిస్థాన్ జిందాబాద్’ అంటూ ఆసిఫ్ నినాదాలు చేశాడు. ఈ క్రమంలోనే వీడియో రికార్టు చేసి ఇన్‌స్టాగ్రామ్‌లో (Instagram) పోస్ట్ చేశాడు ప్రసన్నకుమార్ రెడ్డి. ఈ వీడియో వైరల్ కావడంతో ఆసిఫ్‌పై నల్లచెరువు పోలీసులు కేసు నమోదు చేసి రిమాండ్‌కు పంపించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
పోలీసుల కస్డడీకి కీలక మావోయిస్టులు..
గవర్నర్‌ను కలవనున్న జగన్.. పోలీసులు అలర్ట్
Read Latest AP News And Telugu News