Share News

Upgrades Grade Of Municipalities: ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఆ రెండు మున్సిపాలిటీల గ్రేడ్ పెంపు

ABN , Publish Date - Dec 31 , 2025 | 05:20 PM

రాష్ట్ర ప్రభుత్వం రెండు మున్సిపాలిటీల గ్రేడ్‌ను పెంచుతూ ఆదేశాలు జారీ చేసింది. శ్రీ సత్యసాయి జిల్లాలోని కదిరి మున్సిపాలిటీని స్పెషల్ గ్రేడ్ నుంచి సెలక్షన్ గ్రేడ్‌కు, తూర్పు గోదావరి జిల్లా కొవ్వూర్ మున్సిపాలిటీని గ్రేడ్–3 నుంచి గ్రేడ్–1కు పెంచింది. ఇవాళ్టి నుంచే ఈ నిర్ణయం అమల్లోకి వస్తుందని ప్రభుత్వం తెలిపింది.

Upgrades Grade Of Municipalities: ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఆ రెండు మున్సిపాలిటీల గ్రేడ్ పెంపు
Upgrades Grade Of Municipalities

రాష్ట్రంలో రెండు మున్సిపాలిటీల గ్రేడ్ పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. శ్రీ సత్యసాయి జిల్లాలోని కదిరి మున్సిపాలిటీ హోదా పెంచుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. స్పెషల్ గ్రేడ్‌లో ఉన్న కదిరి మున్సిపాలిటీ హోదాను సెలక్షన్ గ్రేడ్‌కు పెంచింది. గడిచిన రెండేళ్లలో మున్సిపాలిటీ ఆదాయ, వ్యయాలను పరిగణలోకి తీసుకుని హోదాను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. తూర్పు గోదావరి జిల్లా కొవ్వూర్ మున్సిపాలిటీ హోదా గ్రేడ్ 3 నుంచి గ్రేడ్ 1 కు పెంచింది.


2021 నుంచి వచ్చిన ఆదాయాన్ని పరిగణనలోకి తీసుకుని హోదా పెంపుతూ నిర్ణయం తీసుకుంది. ఇవాల్టి నుంచే మున్సిపాలిటీ గ్రేడ్ పెంపు అమల్లోకి వస్తుందని ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. ఈ మేరకు పురపాలక పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్. సురేశ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు.


ఇవి కూడా చదవండి

అజారుద్దీన్‌కు కలిసొచ్చిన 2025.. వరించిన మంత్రి పదవి

న్యూ ఇయర్ సెలబ్రేషన్స్.. ఏం తినాలి? ఏం తినకూడదు?

Updated Date - Dec 31 , 2025 | 06:04 PM