Share News

New Year Party Healthy Tips: న్యూ ఇయర్ సెలబ్రేషన్స్.. ఏం తినాలి? ఏం తినకూడదు?

ABN , Publish Date - Dec 31 , 2025 | 04:55 PM

న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అంటే మాములుగా ఉండదు. పార్టీలు, ఫ్రెండ్స్ గ్యాదరింగ్‌లు, ఫేవరెట్ ఫుడ్ ఇలా అన్నీ ఉంటాయి. కానీ, సెలబ్రేషన్ పేరుతో ఎక్కువగా ఏది తీసుకున్నా ఆరోగ్యానికి సమస్యలు తెచ్చిపెట్టొచ్చు. కాబట్టి..

New Year Party Healthy Tips:  న్యూ ఇయర్ సెలబ్రేషన్స్.. ఏం తినాలి? ఏం తినకూడదు?
New Year Party Healthy Tips

ఇంటర్నెట్ డెస్క్: న్యూ ఇయర్ కొన్ని గంటల్లో ప్రారంభం కానుంది. కొత్త సంవత్సరాన్ని గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకోవడానికి చాలా మంది ఇప్పటికే ప్లాన్లు వేసుకున్నారు. పార్టీలు, ఫ్రెండ్స్ గ్యాదరింగ్‌లు, ఫేవరెట్ ఫుడ్.. ఇవన్నీ న్యూ ఇయర్‌లో కామన్ అయిపోయాయి. చాలా మంది రాత్రిపూట మందు తాగడం, మటన్, చికెన్ లాంటి హెవీ ఫుడ్స్ తీసుకుంటారు. కానీ, ఈ సమయంలో ఏం తింటామన్నది ఆరోగ్యంపై పెద్ద ప్రభావం చూపుతుంది. కాబట్టి న్యూ ఇయర్ పార్టీని ఆనందంగా చేసుకుంటూనే ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోవాలంటే ఈ విషయాలు గుర్తుంచుకోవాలి.


న్యూ ఇయర్ పార్టీలో ఏం తినకూడదు?

  • అతిగా ఫ్రైడ్ ఫుడ్: చిప్స్, పకోడీలు, ఫ్రైడ్ చికెన్ ఎక్కువగా తింటే గ్యాస్, అసిడిటీ వస్తాయి.

  • హెవీ నాన్-వెజ్: మటన్, ఎక్కువగా ఆయిల్‌తో చేసిన చికెన్ రాత్రివేళ జీర్ణం కావడం కష్టం.

  • అతిగా కారమైన ఆహారం: కారం ఎక్కువగా ఉంటే కడుపు మంట, అజీర్ణం సమస్యలు వస్తాయి.

  • తీపి పదార్థాలు: కేకులు, స్వీట్స్ ఎక్కువగా తింటే షుగర్ లెవల్స్ పెరిగే అవకాశం ఉంటుంది.

  • ఆలస్యంగా ఎక్కువగా తినడం: రాత్రి చాలా ఆలస్యంగా, ఎక్కువగా తింటే నిద్రలో ఇబ్బంది కలుగుతుంది.


న్యూ ఇయర్ పార్టీకి ఏం తినాలి?

  • లైట్ స్టార్టర్స్: సలాడ్స్, ఉడికించిన కూరగాయలు, స్ప్రౌట్స్ లాంటివి తింటే కడుపు ఇబ్బంది పడదు.

  • మితంగా ప్రోటీన్ ఉన్న ఆహారం: గ్రిల్ చేసిన చికెన్, ఉడికించిన గుడ్లు, పప్పులు లాంటివి కొద్దిగా తీసుకుంటే శరీరానికి శక్తి వస్తుంది.

  • పండ్లు: పార్టీ మధ్యలో లేదా తర్వాత పండ్లు తింటే జీర్ణక్రియ మెరుగ్గా ఉంటుంది.

  • నేచురల్ డ్రింక్స్: నీరు ఎక్కువగా తాగాలి. నిమ్మరసం, కొబ్బరి నీళ్లు లాంటివి మంచివి.

  • ఇంట్లో తయారు చేసిన ఆహారం: బయట ఆహారం కంటే ఇంట్లో చేసిన సింపుల్ ఫుడ్ ఆరోగ్యానికి మంచిది.


ఎక్కువగా తాగడం వల్ల కలిగే సమస్యలు

జీర్ణ సమస్యలు: మందు, బీరు ఎక్కువగా తాగితే కడుపు మంట, అల్సర్, అసిడిటీ సమస్యలు కలుగుతాయి.

నిద్రలో ఇబ్బంది: ఆల్కహాల్ ఎక్కువగా తీసుకోవడం వల్ల నిద్రలో ఇబ్బంది కలగడమే కాకుండా కొత్త రోజు అలసటతో మొదలవుతుంది.

డీహైడ్రేషన్: మందు ఎక్కువగా తాగడం వల్ల శరీరం నీరు కోల్పోతుంది. శరీరానికి తేమ తగ్గి అలసట, తలనొప్పి లాంటివి వస్తాయి.

బరువు పెరుగుదల: రాత్రి ఆలస్యంగా హెవీ ఫుడ్ తీసుకోవడం, మందు తాగడం వల్ల శరీరంలో కేలరీలు పెరుగుతాయి. ఇది బరువు పెరుగుదలకు కారణం అవుతుంది.


సురక్షితంగా ఇలా జరుపుకోండి

  • మితంగా తాగండి.

  • లైట్ ఆహారం: పార్టీ ముందు పరిమితంలో సలాడ్, సూప్, పండ్లు తినడం ఆరోగ్యానికి బాగుంటుంది.

  • నియంత్రణ: మితంగా తినడం, తాగడం వలన కొత్త సంవత్సరాన్ని ఆరోగ్యంగా, హ్యాపీగా ప్రారంభించవచ్చు.

  • న్యూ ఇయర్ ఆనందంగా, ఫెస్టివ్‌గా జరుపుకోవడం సంతోషకరం. కానీ అత్యధిక ఆహారం, ఎక్కువగా తాగడం ఆరోగ్యానికి హానికరం. మితంగా ఆహారం, మితంగా మందు తీసుకుంటే 2026 సంవత్సరం ఆరోగ్యంగా, ఉత్సాహంగా మొదలవుతుంది.


(Note: ఇందులోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా మీకు అందించడం జరుగుతుంది. కేవలం మీ అవగాహన కోసమే.. ABN ఆంధ్రజ్యోతి దీనిని ధృవీకరించలేదు )

Also Read:

న్యూ ఇయర్ పార్టీ.. ఇండియాలో బెస్ట్ బీచ్ డెస్టినేషన్స్ ఏవో తెలుసా?

కొలెస్ట్రాల్ పెరిగినప్పుడు శరీరంలో కనిపించే సంకేతాలు ఇవే.!

For More Latest News

Updated Date - Dec 31 , 2025 | 05:00 PM