Hyderabad: వామ్మో.. హైడ్రా కూల్చివేతలు మళ్లీ..
ABN , Publish Date - Oct 04 , 2025 | 08:36 AM
ప్రభుత్వ భూమిలో వెలిసిన అక్రమ నిర్మాణాలను గత నెలలో హైడ్రా అధికారులు పలు శాఖల అధికారుల సమన్వయంతో కూల్చి వేసిన విషయం తెలిసిందే. అక్టోబరులో మళ్లీ భారీ స్థాయిలో కూల్చివేతలు చేపడతామని స్థానికులకు చెప్పి వెళ్లారు.
- అక్టోబరులో ఉంటాయని గతంలోనే ప్రకటించిన అధికారులు
- ఆందోళనకు గురవుతున్న కబ్జా స్థలాల్లో ఇల్లు నిర్మించిన వారు
హైదరాబాద్: ప్రభుత్వ భూమిలో వెలిసిన అక్రమ నిర్మాణాలను గత నెలలో హైడ్రా(HYDRA) అధికారులు పలు శాఖల అధికారుల సమన్వయంతో కూల్చి వేసిన విషయం తెలిసిందే. అక్టోబరులో మళ్లీ భారీ స్థాయిలో కూల్చివేతలు చేపడతామని స్థానికులకు చెప్పి వెళ్లారు. ఈ నేపథ్యంలో కబ్జాదారులు వెన్నులో వణుకు పుడుతోంది. గాజులరామారం డివిజన్(Gajularamaram Division)లోని ప్రభుత్వ సర్వే నెంబరు 307లోని గాలి పోచమ్మ, బాలయ్య బస్తీల్లో సుమారు 275 వరకు హైడ్రా అధికారులు అక్రమ నిర్మాణాల కూల్చి వేతలు చేపట్టారు.

సెప్టెంబరులో మళ్లీ కూల్చివేతలు చేపడతామన్న అధికారుల హెచ్చరికల నేపథ్యంలో కబ్జాదారుల నుంచి స్థలాలు కొని ఇళ్లు నిర్మించిన వారు తీవ్ర ఆందోళనకు లోనవుతున్నారు. ప్రభుత్వ సర్వే నెంబరు 329, 342ల్లో కొన్ని బస్తీలు ప్రభుత్వ భూముల్లో వెలిశాయి. ఈ బస్తీల్లో కూల్చి వేతలు ఉంటాయా? లేక రాజకీయ నాయకుల ఒత్తిళ్లతో ఆపుతారా? అనేది వేచి చూడాల్సిందే.

ఏదేమైనా హైడ్రా అధికారులు కూల్చి వేతలతో కొనుగోలుదారులు అయోమయంలో పడి పోతున్నారు. ‘మా డబ్బులు మాకిచ్చి... మీ ప్లాట్లను మీరు తీసుకోండి’ అని కబ్జాదారులను నిలదీస్తున్నారని పలువురు అంటున్నారు. ఈ అంశం దేవేందర్‌నగర్(Devendernagar) ప్రాంతంలో చర్చాంశనీయంగా మారింది. ఈ నెలలో హైడ్రా అధికారులు అక్రమ నిర్మాణాలను కూల్చి వేస్తే సుమారు 10 బస్తీల వరకు నేల మట్టమయ్యే అవకాశం ఉంది.
ఈ వార్తలు కూడా చదవండి..
విజయ్ దేవరకొండ - రష్మిక నిశ్చితార్థం.. అనుకున్నదే జరిగింది
పెరిగిన ఆధార్ అప్‌డేట్ ఛార్జీలు.. ఏ సేవకి ఎంత చెల్లించాలంటే
Read Latest Telangana News and National News