Home » HYDRA
శాంత శ్రీరామ్ కన్‌స్ట్రక్షన్ వ్యవహారంలో తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో షాక్ తగిలింది. శాంతా శ్రీరామ్ కన్‌స్ట్రక్షన్ కేసుపై సుప్రీంకోర్టులో మంగళవారం విచారణ జరిగింది.
హైడ్రా కమిషనర్ రంగనాథ్‌కు తెలంగాణ హై కోర్టులో ఊరట లభించింది. శాంతా శ్రీరామ్ కన్‌స్ట్రక్షన్ కేసులో ఆయనపై సింగిల్ బెంచ్ ఇచ్చిన ఆర్డర్‌ను డివిజన్ బెంచ్ సస్పెండ్ చేసింది.
హైడ్రా కమిషనర్ రంగనాథ్ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. శాంతా శ్రీరామ్ కన్‌స్ట్రక్షన్ కేసుపై అప్పీల్‌కు వెళ్లారు. రంగనాథ్‌ను తప్పించి మరో అధికారిని నియమించాలని గతంలో సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును ఆయన సవాల్ చేశారు.
అనధికార నిర్మాణాల కేసులను పరిశీలించడానికి ఏర్పాటు చేసిన ‘బిల్డింగ్ ట్రైబ్యునల్’కు చైర్‌పర్సన్, సభ్యులను తక్షణమే నియమించాలని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్(ఎఫ్‌జీజీ) డిమాండ్ చేసింది.
సైబరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ (సీఎంసీ) పరిధిలో అనధికార నిర్మాణాలపై ఎన్‌ఫోర్స్‌మెంట్ చర్యలు ముమ్మరమయ్యాయి. సీఎంసీ కమిషనర్ జి.సృజన ఆదేశాల మేర కు ఎన్‌ఫోర్స్‌మెంట్ బృందాలు సోమవారం క్షేత్రస్థాయిలో తనిఖీలు నిర్వహించి 38 అనధికార నిర్మాణంలో ఉన్న భవనాలను గుర్తించాయి.
గచ్చిబౌలి అంజయ్య నగర్‌లో శనివారం ఏడంతస్తుల భవనం కూలి మధ్యప్రదేశ్‌కు చెందిన ఇద్దరు టైల్స్ కార్మికులు మృతిచెందారు. ఈ ప్రమాదంలో మరో ఇద్దరు గాయపడిన విషయం తెలిసిందే.
గచ్చిబౌలిలోని అంజయ్యనగర్‌లో ఏడంతస్తుల భవనం కుప్పకూలిది. ఈ ఘటనలో ఇద్దరు మృతిచెందగా మరో ఇద్దరు గాయపడ్డారు. ఈ ఘటన విషయం తెలియడంతో అక్కడకు హైడ్రా కమిషనర్ రంగనాథ్ చేరుకున్నారు. ప్రమాద వివరాలు అడిగి తెలుసుకున్నారు
హైకోర్టు స్టే ఆదేశాలను ఉల్లంఘించి ప్రైవేటు ఆస్తులను కూల్చివేసిన ఆరోపణలపై హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్‌పై రాష్ట్ర హైకోర్టు సుమోటోగా కోర్టు ధిక్కరణ అభియోగాలు మోపింది.
హైదరాబాద్‌లో సరూర్‌నగర్ స్టేడియం వద్ద తోపులాట జరిగింది. హైడ్రాలో 150 డ్రైవర్ ఉద్యోగాల కోసం నిరుద్యోగులు పోటెత్తారు.
ఇంటర్ కాలేజీల నకిలీ ఫైర్ ఎన్ఓసీల వ్యవహారంలో పోలీసుల విచారణ కొనసాగుతోంది. మరో 48 కాలేజీల చిట్టాను హైడ్రా అధికారులు పోలీసులకు అందజేశారు.