రూ.700 కోట్ల భూమిని కాపాడిన హైడ్రా..
ABN , Publish Date - Feb 10 , 2026 | 12:26 PM
హైదరాబాద్‌లోని కొండాపూర్ జంగంకుంట ఆక్రమణలపై హైడ్రా సీరియస్ అయ్యింది. దాదాపు రూ.700 కోట్ల విలువైన భూమిని కబ్జాదారుల నుంచి రక్షించింది..
హైదరాబాద్, ఫిబ్రవరి 10: నగరంలో భూ ఆక్రమణలపై హైడ్రా (HYDRA) దూకుడు కొనసాగుతోంది. గచ్చిబౌలి - కొండాపూర్ ప్రాంతాల్లో సుమారు రూ. 700 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని ఆక్రమణదారుల నుంచి రక్షించింది. కొండాపూర్‌లోని జంగంకుంట ఆక్రమణలపై హైడ్రా అధికారులు సీరియస్ అయ్యారు. శేరిలింగంపల్లి మున్సిపల్ కార్యాలయం సమీపంలోని మదీనగూడ మజీద్ బండ వద్ద హైడ్రా ఆపరేషన్ మొదలుపెట్టింది. సుమారు 4 ఎకరాల జంగంకుంటను ఆక్రమణదారులు మాయం చేసినట్లు అధికారులు గుర్తించారు. కబ్జాదారులు సర్వే నంబర్ 134లో మట్టి పోసి కుంటను చదును చేశారు.
ఈ భూమిని ప్లాట్లుగా విభజించి అమ్మకానికి సిద్ధమయ్యారు. ఈ ఆక్రమణలపై ఇప్పటికే రెవెన్యూ అధికారులు కేసులు నమోదు చేశారు. జంగంకుంటలో రెవెన్యూ అధికారులతో కలిసి హైడ్రా టీం.. జాయింట్ ఇన్‌స్పెక్షన్ నిర్వహించింది. పోలీసుల సహకారంతో హైడ్రా సిబ్బంది.. కుంట చుట్టూ ఫెన్సింగ్ వేస్తోంది. కాగా, హైదరాబాద్‌లో ప్రకృతి వనరులు, ప్రభుత్వ ఆస్తుల రక్షణకు 2024లో హైడ్రా ఏర్పాటైంది. భూమి ఆక్రమణలు, చెరువులు, కుంటల రక్షణ, విపత్తు నిర్వహణలో కీలక పాత్ర పోషిస్తోంది. ఇప్పటివరకు వేలాది ఎకరాల భూమిని రికవరీ చేసి, అక్రమ నిర్మాణాలను కూల్చివేసింది. ఇటీవల హైడ్రా.. నిర్మాణాలను కూల్చివేయడమే కాకుండా, తవ్వకాలు కూడా చేపట్టిన విషయం తెలిసిందే.
ఇవి కూడా చదవండి..
విద్యుత్తు చార్జీల భారం తగ్గాలి
హీరోయిజం చూపిస్తే.. కఠిన చర్యలు తప్పవు.. సీపీ సజ్జనార్ హెచ్చరిక
Read Latest Telangana News And Telugu News