Share News

ఆ 6.12 ఎకరాలు ప్రభుత్వ భూమే..

ABN , Publish Date - Jan 23 , 2026 | 07:56 AM

హైదరాబాద్ మహానగరంతోపాటు చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల్లో ఆక్రమణకు గురైన ప్రభుత్వ భూములు, స్థలాలను రక్షణే లక్ష్యంగా పనిచేస్తున్న హైడ్రా.. మరో కోట్లాది రూపాయల విలువ చేసే పభుత్వ భూమిని కాపాడగలిగింది. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.

ఆ 6.12 ఎకరాలు ప్రభుత్వ భూమే..

- తాజాగా వెల్లడించిన హైడ్రా

హైదరాబాద్‌ సిటీ: మేడ్చల్‌ జిల్లా ఘట్‌కేసర్‌ మండలం కాచవాని సింగారం(Kachavani Singaram) గ్రామం సర్వే నంబరు 66లో ఉన్న 6.12 ఎకరాలు ప్రభుత్వ భూమేనని హైడ్రా(HTDRAA) వెల్లడించింది. జిల్లా సర్వే అధికారి దానిని ప్రభుత్వ భూమిగా నిర్ధారించి హద్దులను చూపించిన తర్వాతే తాము ఫెన్సింగ్‌ ఏర్పాటు చేసినట్లు గురువారం ఒక ప్రకటనలో పేర్కొంది. ఇప్పటికే ఇళ్లు కట్టుకున్న వారిని మినహాయించి మిగిలిన భూమిని కాపాడినట్లు స్పష్టం చేసింది. సర్వే నంబరు 62తో పాటు 63ను చూపించి 66లో ఉన్న ప్రభుత్వ భూమిలోకి చొరబడి ప్లాట్లుగా విక్రయించింది హనుమంతరెడ్డి కుటుంబ సభ్యులేనని తమ వద్ద ఆధారాలున్నాయని చెప్పింది.


దివ్యానగర్‌ లేఔట్‌లో భాగంగానే ఇక్కడ ప్లాట్లు విక్రయించారని, 66 సర్వే నంబరులోని ప్రభుత్వ భూమిని తన విద్యా సంస్థలకు అందజేయాలని 2009లో నల్ల మల్లారెడ్డి(Nalla Mallareddy) దరఖాస్తు చేసుకున్నట్లు వివరించింది. ఇలా 6.12 ఎకరాల ప్రభుత్వ భూమిని తన ఆధీనంలో ఉంచుకుని 3 ఎకరాల మేర నల్ల మల్లారెడ్డి కుటుంబ సభ్యులు మామిడి తోట ఏర్పాటు చేశారని చెప్పింది. ప్రైవేటు భూమికి సంబంధించిన 62, 63 సర్వే నంబర్లు చూపించి 66 సర్వే నంబర్‌లోని ప్రభుత్వ భూమిలో దాదాపు 50 ప్లాట్లను హనుమంతరెడ్డి కుటుంబ సభ్యులు కొంతమందికి అమ్మినట్లు తెలిపింది.


city3.2.jpgప్రభుత్వ భూమిలో ప్లాట్లు విక్రయించినందుకు గాను బాధితులకు ప్రత్యామ్నాయం చూపాల్సిన నల్ల మల్లారెడ్డి, హనుమంతరెడ్డి వారికి అన్యాయం జరిగిందంటూ గగ్గోలు పెట్టడం విడ్డూరంగా ఉందని పేర్కొంది. ఏడీ సర్వే బృందం వచ్చి సోమవారం హద్దులు నిర్థారించిన తర్వాత మాత్రమే హైడ్రా చర్యలు తీసుకుందని పేర్కొంది.


ఈ వార్తలు కూడా చదవండి.

హమ్మయ్య! పసిడి, వెండి ధరలు తగ్గాయోచ్!

వైసీపీది భూ భక్ష పథకం

Read Latest Telangana News and National News

Updated Date - Jan 23 , 2026 | 07:56 AM