Home » AV Ranganath
మహానగరంలో చెరువులు, నాలాల లెక్కను శాస్త్రీయ విధానం ద్వారా తేల్చేందుకు హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ ఎసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ(హైడ్రా) సన్నద్ధమైంది.
మహా నగరంలో చెరువులు, పార్కులు, ప్రభుత్వ స్థలాలపై నిరంతర నిఘాకు హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ(హైడ్రా) చర్యలు తీసుకుంటోంది.
మధురానగర్ కాలనీ మధురమైన కాలనీ కింద ఉండేది ఒకప్పుడు,పద్ధతి ప్రకారం కాలనీ అంటే ఇలా ఉండాలి అనేలా ఉండేది.. ఇప్పుడు ఏ వీధి చూసినా కమర్షియ ల్ కింద అయిపోయిందని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్(Hydra Commissioner AV Ranganath) అన్నారు.
మూసీకి ఇరువైపులా చేసిన సర్వే, మార్కింగ్తో హైడ్రాకు సంబంధం లేదని కమిషనర్ ఏవీ రంగనాథ్ స్పష్టం చేశారు. ఆయా ప్రాంతాల్లోని నిర్వాసితులను తరలించడం లేదని, నది సుందరీకరణ ప్రాజెక్టును మూసీ రివర్ ఫ్రంట్ డెవల్పమెంట్ కార్పొరేషన్ చేపడుతున్నదని పేర్కొన్నారు.
డిటోనేటర్లు పెట్టి మల్కాపూర్ చెరువులో కట్టడాలను కూల్చివేసిన అధికారులు, ఇప్పుడు హైడ్రాకి, హోంగార్డు గోపాల్ చనిపోవడానికి ఎలాంటి సంబంధం లేదని చేతులు దులుపుకోవడం సిగ్గుమాలిన చర్య అని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్రావు ధ్వజమెత్తారు. ఈ సంఘటనపై ప్రభుత్వం నిర్లక్ష్యంగా ఉండటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానని అన్నారు. హోంగార్డు గోపాల్ కుటుంబాన్ని ఆదుకోవాలని ప్రభుత్వాన్ని హరీష్రావు డిమాండ్ చేశారు.
ఓ వైపు మూసీ ఆక్రమణల మార్కింగ్.. మరోవైపు చెరువులు, ప్రభుత్వ స్థలాల్లోని నిర్మాణాల కూల్చివేత..
హైడ్రా అధికారులకు సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అల్టిమేటం జారీ చేశారు. హైడ్రా పేరుతో సంగారెడ్డి నియోజకవర్గ ప్రజల్లో అనవసర భయాందోళనలు సృష్టించకండి అని హెచ్చరించారు. సంగారెడ్డి నియోజకవర్గంలో కూల్చివేతల పేరిట అధికారులు అతుత్సాహం ప్రదర్శించకండి అని అన్నారు.
కూల్చివేతలన్నీ హైడ్రాకు ముడిపెట్టవద్దు అని హైడ్రా కమిషనర్ రంగనాథ్ తెలిపారు. సంగారెడ్డి మల్కాపూర్ చెరువులో హైడ్రా ఎలాంటి కూల్చివేతలు చేపట్టలేదని తెలిపారు. వాటికి హైడ్రాకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు.
మూసీ నదీ గర్భం (రివర్ బెడ్)లో నివసిస్తున్న ప్రజలను బలవంతంగా కాకుండా ఇష్టప్రకారమే తరలిస్తున్నామని పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి, మూసీ రివర్ ఫ్రంట్ డెవల్పమెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఎంఆర్ఎ్ఫడీసీఎల్) ఎండీ దాన కిశోర్ తెలిపారు.
నగరంలో బుచ్చమ్మ అనే వృద్ధురాలు ఆత్మహత్య చేసుకోవడంపై హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్(AV Ranganath)పై మానవ హక్కుల కమిషన్(HRC) కేసు నమోదు చేసింది.