HYDRAA: పార్కును కాపాడిన హైడ్రా..
ABN , Publish Date - Dec 30 , 2025 | 09:49 AM
హైడ్రా.. ఓ పాక్కును కాపాడింది. అయితే.. ఈ స్థలాల విలు రూ. 13 కోట్లు ఉంటుందని అంచనా. శేరిలింగంపల్లి మండలం, మదీనగూడ విలేజ్‌లో పార్కు కోసం స్థలాన్ని కేటాయించగా.. ఓ వ్యక్తి కబ్జా చేసి చుట్టూ ప్రహరీ నిర్మించాడు. అయితే దీనిపై ఫిర్యాదులు రావడంతో రంగంలోకి దిగిన హైడ్రా.. ఆ స్థలాన్ని కాపాడింది.
- రూ. 13 కోట్ల విలువైన స్థలం చుట్టూ ఫెన్సింగ్
హైదరాబాద్: శేరిలింగంపల్లి మండలం, మదీనగూడ విలేజ్‌లో పార్కును హైడ్రా(HYDRAA) కాపాడింది. దీని విలువ రూ. 13 కోట్లు ఉంటుంది. సర్వే నంబరు 23లో ఉషోదయ ఎన్‌క్లేవ్ పేరిట హుడా అనుమతి పొందిన లేఅవుట్ ఉంది. ఇందులో 1000 గజాల స్థలాన్ని పార్కుకు కేటాయించారు. ఈ మేరకు జీహెచ్‌ఎంసీ(GHMC)కి గిఫ్ట్‌డీడ్ కూడా చేశారు. పార్కు స్థలాన్ని ఓ వ్యక్తి కబ్జా చేసి చుట్టూ ప్రహరీ నిర్మించాడు. పార్కు స్థలాన్ని కాపాడాలని ఉషోదయ ఎన్‌క్లేవ్ నివాసితుల పోరాటం చేస్తున్నారు.

ప్రజావాణిలో ఫిర్యాదు చేయడంతో రెవన్యూ, జీహెచ్‌ఎంసీ అధికారులతో క్షేత్రస్థాయిలో హైడ్రా పరిశీలించింది. పార్కు స్థలమని నిర్ధారించుకుని సోమవారం ప్రహరీ కూల్చివేసి, చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేసింది. పార్కు స్థలమని పేర్కొంటూ బోర్డులు ఏర్పాటు చేసింది.

ఈ వార్తలు కూడా చదవండి..
Read Latest Telangana News and National News