HYDRA: 3 వేల గజాల పార్కు స్థలాలను కాపాడిన హైడ్రా
ABN , Publish Date - Jan 04 , 2026 | 07:09 AM
హైదరాబాద్ మహానగరంలో అత్యంత ఖరీదైన ఏరియాల్లో ఒకటైన కూకట్‌పల్లి పరిధిలో మూడువేల గజాల ప్రభుత్వ స్థలాన్ని హైడ్రా కాపాడింది. దీని విలువ రూ. 35 కోట్లు ఉంటుందని అంచనా. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.
- రూ. 35 కోట్ల విలువైన స్థలాల చుట్టూ ఫెన్సింగ్
హైదరాబాద్ సిటీ: కూకట్‌పల్లి(Kukatpally) పరిధిలో 3 వేల గజాల విస్తీర్ణంలో ఉన్న రెండు పార్కులను హైడ్రా శనివారం కాపాడింది. ఈ భూమి విలువ రూ.35కోట్ల వరకు ఉంటుందని అధికారులు పేర్కొన్నారు. భాగ్యనగర్ ఫేజ్- 3 కాలనీ(Bhagyanagar Phase-3 Colony)లో రెండు పార్కులు కబ్జాకు గురయ్యాయని ఇటీవల హైడ్రా ప్రజావాణికి అక్కడి నివాసితుల సంక్షేమ సంఘం ఫిర్యాదు చేసింది. కమిషనర్ ఏవీ రంగనాథ్(Commissioner AV Ranganath) ఆదేశాలతో వివిధ శాఖల అధికారులతో కలిసి హైడ్రా అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

357 ప్లాట్లతో ఏర్పడిన భాగ్యనగర్ ఫేజ్-3 కాలనీలో రెండు పార్కులు ఆక్రమణకు గురయినట్లు గుర్తించి ఆ మేరకు నివేదిక సమర్పించారు. సదరు నివేదిక ఆధారంగా హైడ్రా కమిషనర్ ఆదేశాలతో శనివారం ఆక్రమణలను అధికారులు తొలగించారు. రెండు పార్కుల చుట్టూ ఫెన్సింగ్ వేసి, పార్కు స్థలాలుగా పేర్కొంటూ హైడ్రా బోర్డులను అధికారులు ఏర్పాటు చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
మీ నగరంలో ఈ రోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..
తెలుగు రాష్ట్రాల్లో ఏబీఎన్ - ఆంధ్రజ్యోతి ముగ్గుల పోటీలు
Read Latest Telangana News and National News