HYDRA: దుర్గంచెరువు ఆక్రమణలకు ‘హైడ్రా’ చెక్
ABN , Publish Date - Dec 31 , 2025 | 09:04 AM
హైదరాబాద్ మహానగరంలోగల దుర్గంచెరువు ఆక్రమణలకు ‘హైడ్రా’ పెడుతోంది. ఇందులో భాగంగా దాదాపు 5 ఎకరాల మేర కబ్జాకు గురైనట్లు గుర్తించారు. వీటిని తొలగించి ప్రభుత్వ ఆస్తులను కాపాడింది. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.
- 5 ఎకరాల మేర కబ్జాల తొలగింపు
హైదరాబాద్ సిటీ: నగరంలో పేరొందిన దుర్గం చెరువు చుట్టూ పెరిగిపోయిన కబ్జాలను హైడ్రా(HYDRA) అరికడుతోంది. మాదాపూర్‌లోని ఇనార్బిట్ మాల్(Inorbit Mall) వైపు మంగళవారం దాదాపు 5 ఎకరాల మేర ఉన్న కబ్జాలను తొలగించింది. మట్టితో నింపి వాహనాల పార్కింగ్ కోసం స్థలాన్ని వినియోగిస్తూ ప్రతి నెలా రూ. 50 లక్షల వరకు అద్దె వసూలు చేస్తున్న దందాకు సంస్థ చెక్ పెట్టింది.

మట్టితో నింపుతూ ఆక్రమణలు..
ఇనార్బిట్ మాల్ వైపు ఏకంగా 5 ఎకరాలు కబ్జాలకు గురైనట్లు అధికారులు ఇటీవల గుర్తించారు. 10 నుంచి 15 మీటర్ల మేర మట్టితో నింపి క్రమంగా చెరువులోకి జరిగి కబ్జా చేసి, ఆ స్థలం తనదంటూ ఓ ప్రజా ప్రతినిధి క్లెయిమ్ చేస్తున్న విషయాన్ని తెలుసుకున్నారు. సదరు వ్యక్తి స్కూల్ బస్సులు, ఐటీ సంస్థలకు చెందిన వాహనాల పార్కింగ్‌తో ప్రతి నెలా రూ.50 లక్షల వరకూ అద్దెలు అనుభవిస్తూ పార్కింగ్ దందా చేస్తున్నాడని గుర్తించారు. రంగంలోకి దిగి ఆక్రమణలను తొలగించారు. కాగా ఒకప్పుడు 160 ఎకరాల మేర ఉన్న చెరువు ప్రస్తుతం 116 ఎకరాలుగా మిగిలిపోయింది.
ఈ వార్తలు కూడా చదవండి..
కల్తీ నెయ్యి కేసులో వేమిరెడ్డి ప్రశాంతి విచారణ
మద్దతు ధరకు పప్పుధాన్యాల కొనుగోలు
Read Latest Telangana News and National News