HYDRA: 12.17 ఎకరాల ప్రభుత్వ భూమికి ఫెన్సింగ్
ABN , Publish Date - Jan 03 , 2026 | 07:12 AM
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో మొత్తం 12.17 ఎకరాల ప్రభుత్వ భూమికి హైడ్రా కాపాడింది. దీని విలువ కోట్లల్లో ఉంటుందని అంచనా. హైదరాబాద్ నగరమేగాక చుట్టుపక్కల ప్రాంతాల్లో కబ్జాలకు గురైన ప్రభుత్వ భూములు, ఆస్తులను హైడ్రా తిరిగి స్వాధీనం చేసుకుంటోంది.
హైదరాబాద్ సిటీ: గండిపేట(Gandipet) మండలం గంధంగూడ గ్రామంలో 12.17 ఎకరాల ప్రభుత్వ భూమిని హైడ్రా శుక్రవారం కాపాడింది. సర్వే నంబర్ 43లో ఉన్న భూమి మున్ముందు కబ్జాకు గురికాకుండా చుట్టూ ఫెన్సింగ్ వేసింది. ఇదే సర్వే నెంబర్‌లో 26 ఎకరాల ప్రభుత్వ భూమి ఉండగా.. ఎకరా భూమిని విద్యుత్ సబ్‌స్టేషన్, మరో 9 ఎకరాలను జీహెచ్‌ఎంసీ డంపింగ్ యార్డు(GHMC dumping yard) కోసం ప్రభుత్వం కేటాయించింది.

కేటాయింపులు పోను మిగిలిన భూమి క్రమేణా కబ్జా అవుతోందని స్థానికులకు హైడ్రా ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. దీంతో క్షేత్రస్థాయిలో పరిశీలించిన అధికారులు అది ప్రభుత్వ భూమిగా నిర్ధారించుకున్నారు. ఇప్పటికే ఆ స్థలంలో ఆలయం, మసీదు నిర్మాణం జరిగింది. వాటి జోలికి వెళ్లకుండా మిగతా భూమి భవిష్యత్తులో కబ్జా కాకుండా హైడ్రా చర్యలు తీసుకుంది. ప్రభుత్వ భూమిగా పేర్కొంటూ బోర్డులు ఏర్పాటు చేశారు.

ఈ వార్తలు కూడా చదవండి..
నువ్వేమీ టీచర్‌వి కాదు.. మాకు పాఠాలు చెప్పొద్దు
ఏవీవైఏవైకు రూ.2.91 కోట్లు విడుదల
Read Latest Telangana News and National News