AV Ranganath: ప్రతీ చెరువును పర్యాటక ప్రాంతంలా అభివృద్ధి చేయాలి
ABN , Publish Date - Dec 25 , 2025 | 10:01 AM
హైదరాబాద్ మహా నగరంలో ప్రతీ చెరువును పర్యాటక ప్రాంతంలా అభివృద్ధి చేయాలని హైడ్రా కమిషనర్ ఆవుల వెంకట రంగనాథ్ సిబ్బందిని ఆదేశించారు. ఆయన మాట్లాడుతూ.. పతంగుల పండుగ నాటికి చెరువులను సిద్ధం చేయాలన్నారు.
- చెరువుల వద్ద పతంగుల పండుగ నిర్వహించాలి
- హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్
హైదరాబాద్ సిటీ: ప్రతీ చెరువును ఒక పర్యాటక ప్రాంతంలా అభివృద్ధి చేయాలని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్(HYDRA Commissioner AV Ranganath) ఆదేశాలిచ్చారు. తమ్మిడికుంట, కూకట్‌పల్లిలోని నల్ల చెరువుల అభివృద్ధి పనులను బుధవారం ఆయన క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. పతంగుల పండుగ నాటికి చెరువులను సిద్ధం చేయాలన్నారు. సంక్రాంతి సందర్భంగా జనవరి 13 నుంచి 15 వరకు రాష్ట్ర ప్రభుత్వం పతంగుల పండుగ నిర్వహిస్తున్నదని, ఈ సారి హైడ్రా అభివృద్ధి చేసిన చెరువుల చెంత కూడా ఈ పండుగను జరిపించాలని ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు.

చెరువులలోకి నేరుగా మురుగు నీరు చేరకుండా సీవరేజ్ ట్రీట్‌మెంట్ ప్లాంట్ల ద్వారా శుద్ధి జలాలు వచ్చేలా వెంటనే ఏర్పాటు చేయాలని సూచించారు. ఇన్‌లెట్లు, ఔట్‌లెట్ల నిర్మాణంతోపాటు పరిసర ప్రాంతాల నుంచి వర్షపు నీరు సులభంగా చెరువులోకి చేరేలా చానల్స్ అభివృద్ధి చేయాలని తెలిపారు. చెరువుల వద్ద భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని, తాగు నీటి వసతితోపాటు మరుగుదొడ్లు ఏర్పాటు చేయాలన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఎల్‌వీఎం 3 ఎం6కి అనంత్ టెక్నాలజీస్ పరికరాలు
సబ్బుల్లో నంబర్ 1 బ్రాండ్‌గా సంతూర్
Read Latest Telangana News and National News