Share News

ISRO: ఎల్‌వీఎం 3 ఎం6కి అనంత్‌ టెక్నాలజీస్‌ పరికరాలు

ABN , Publish Date - Dec 25 , 2025 | 05:59 AM

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ విజయవంతంగా ప్రయోగించిన ఎల్‌వీఎం3 ఎం6 రాకెట్‌కు అవసరం అయిన హార్డ్‌వేర్‌, ఏవియానిక్స్‌ సిస్టమ్స్‌, ఎలక్ర్టానిక్స్‌, ప్రెసిషన్‌ సబ్‌ సిస్టమ్స్‌ హైదరాబాద్‌కు....

ISRO: ఎల్‌వీఎం 3 ఎం6కి అనంత్‌ టెక్నాలజీస్‌ పరికరాలు

హైదరాబాద్‌: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) విజయవంతంగా ప్రయోగించిన ఎల్‌వీఎం3 ఎం6 రాకెట్‌కు అవసరం అయిన హార్డ్‌వేర్‌, ఏవియానిక్స్‌ సిస్టమ్స్‌, ఎలక్ర్టానిక్స్‌, ప్రెసిషన్‌ సబ్‌ సిస్టమ్స్‌ హైదరాబాద్‌కు చెందిన అనంత్‌ టెక్నాలజీస్‌ (ఏటీఎల్‌) సరఫరా చేసింది. ఆత్మనిర్భర్‌ భారత్‌ విజన్‌కు అనుగుణంగా ఈ వ్యవస్థలన్నింటినీ ఏటీఎల్‌ అత్యాధునిక కేంద్రంలో తయారుచేసినట్టు కంపెనీ చైర్మన్‌ డాక్టర్‌ సుబ్బారావు పావులూరి చెప్పారు. ఈ విజయం ఇస్రో చరిత్రలో ఒక కీలకమైన మైలురాయి అని, అందులో తాము కూడా భాగస్వాములు కావడం ఆనందంగా ఉన్నదని అన్నారు.

వికాస్‌ ఇంజన్లు సరఫరా చేసిన ఎంటార్‌

ఎల్‌వీఎం3-ఎం6కు అవసరం అయిన వికాస్‌ ఇంజన్లు, క్రయోజెనిక్‌ ఎగువ స్టేజ్‌ అసెంబ్లీలు, కీలకమైన పలు ఇతర భాగాలు తాము సరఫరా చేసినట్టు హైదరాబాద్‌కు చెందిన ఎంటార్‌ టెక్నాలజీస్‌ తెలిపింది. రాబోయే కాలంలో భారత అంతరిక్ష పరిశ్రమ ప్రపంచ స్థాయిలో కీలక పాత్ర పోషిస్తుందని భావిస్తున్నామని, ఆ ప్రయత్నంలో ఇస్రోకు తమ మద్దతు కొనసాగించేందుకు ఆసక్తిగా ఎదురు చూస్తున్నామని కంపెనీ మేనేజింగ్‌ డైరెక్టర్‌ పర్వత్‌ శ్రీనివాస్‌ రెడ్డి అన్నారు.

Updated Date - Dec 25 , 2025 | 06:00 AM