Share News

AP News: గుడివాడలో టీడీపీ సానుభూతిపరుడి కిడ్నాప్ కలకలం..

ABN , Publish Date - Jan 08 , 2026 | 08:45 AM

జిల్లాలోని గుడివాడలో టీడీపీ సానుభూతిపరుడు దుగ్గిరాల ప్రభాకర్ కిడ్నాప్ అంశం తీవ్ర కలకలం రేపింది. గత ప్రభుత్వ పెద్దల అవినీతిపై ఫిర్యాదులు చేశారనే కారణంతో అతన్ని కిడ్నాప్ చేసినట్లు తెలుస్తోంది. ఈ అంశంలోనే అతన్ని బెదిరించి..

AP News: గుడివాడలో టీడీపీ సానుభూతిపరుడి కిడ్నాప్ కలకలం..
Gudivada kidnapping news

కృష్ణా: జిల్లాలోని గుడివాడలో టీడీపీ సానుభూతిపరుడు దుగ్గిరాల ప్రభాకర్ కిడ్నాప్ అంశం తీవ్ర కలకలం రేపింది. గత ప్రభుత్వ పెద్దల అవినీతిపై ఫిర్యాదులు చేశారనే కారణంతో అతన్ని కిడ్నాప్ చేసినట్లు తెలుస్తోంది. ఈ అంశంలోనే అతన్ని బెదిరించి.. రాత్రి సమయంలో వదిలేసినట్లు బాధిత వ్యక్తి కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి..


ప్రభాకర్ బుధవారం ఉదయం తొమ్మిదిగంటలకు తన బైక్‌పై మచిలీపట్నం వెళ్తుండగా.. పెడన వద్ద గుర్తు తెలియని వ్యక్తులు అతన్ని కిడ్నాప్ చేశారు. అనంతరం నిర్మానుష్య ప్రాంతంలోకి తీసుకెళ్లి సాయంత్రం వరకు నిర్బంధించారు. బెదిరింపులకు గురి చేసి.. రాత్రి సమయంలో అతన్ని వదిలేశారు. దుండగులు వదిలేయడంతో ప్రభాకర్ నేరుగా గుడివాడ ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో చేరారు. దుండగులు తనను కొట్టారని ప్రభాకర్ వీడియాకు వివరించారు. కాగా, లిక్కర్ గోడౌన్, లీజ్ వ్యవహారంలో మాజీ మంత్రి కొడాలి నాని, అబ్కారీ కార్పొరేషన్ ఎండీ వాసుదేవ రెడ్డిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు ప్రభాకర్. ఈ కేసు ప్రస్తుతం విచారణకు రానుంది.


ఈ కేసు విషయంలో వారే దాడి చేయించి ఉంటారని ప్రభాకర్ కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై మీడియాతో మాట్లాడేందుకు ప్రభాకర్ నిరాకరిస్తున్నారు. ప్రభాకర్ పూర్తి వివరాలు చెబితే అసలు ఏం జరిగిందనేది తెలియనుంది. కాగా, ఈ కిడ్నాప్ వ్యవహారంపై ప్రభాకర్ కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న గుడివాడ టూ టౌన్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.


Also Read:

మీ దృష్టి గొప్పదైతే.. ఈ ఫొటోలో దాక్కున్న రెండో మహిళను 22 సెకెన్లలో కనిపెట్టండి!

తెలంగాణలో భారీ అగ్ని ప్రమాదం.. ఒక్కసారిగా మంటలు వ్యాపించి..

ఖరీదైన మద్యం బాటిళ్లలో కల్తీ..

Updated Date - Jan 08 , 2026 | 09:15 AM