Share News

Nara Bhuvaneswari: విద్యార్థులు దేశాన్ని లీడ్ చేయాలి

ABN , Publish Date - Dec 26 , 2025 | 04:18 PM

విద్యార్థులు ఆంగ్లంలో ప్రతిభ కనబర్చేలా అధ్యాపకులు చూడాలని సీఎం చంద్రబాబు సతీమణి, ఎన్టీఆర్ ట్రస్టు మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి సూచించారు. తానూ నిమ్మకూరు రావడం స్వీట్ మెమరీ అని.. ఇది మా తాత లక్ష్మయ్య ఊరని చెప్పుకొచ్చారు. చిన్నప్పుడు సెలవులు వస్తే అమ్మ, తమను నిమ్మకూరు పంపించేదని అన్నారు.

Nara Bhuvaneswari: విద్యార్థులు దేశాన్ని లీడ్ చేయాలి
Nara Bhuvaneswari

  • నిమ్మకూరులో గురుకుల పాఠశాలను సందర్శించిన నారా భువనేశ్వరి

  • గురుకుల విద్యార్థులకు మార్గదర్శనం

  • రూ.3.50 కోట్లతో నిర్మించిన హాస్టల్ భవనం ప్రారంభం

  • నిమ్మకూరు నా స్వీట్ మెమరీ: బాల్య జ్ఞాపకాలు పంచుకున్న భువనేశ్వరి

  • విద్యార్థుల భవిష్యత్తే దేశ భవిష్యత్తు: నారా భువనేశ్వరి

కృష్ణాజిల్లా గుడివాడ, డిసెంబరు26 (ఆంధ్రజ్యోతి): విద్యార్థులు సమాజాన్ని, దేశాన్ని లీడ్ చేసేలా ఉండాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సతీమణి, ఎన్టీఆర్ ట్రస్టు మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి (Nara Bhuvaneswari) వ్యాఖ్యానించారు. స్కూల్ చదువు పూర్తి చేసుకుని బయటకు వచ్చే సమయంలో జీవితంలో ఒక లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ఇవాళ(శుక్రవారం) నిమ్మకూరులోని గురుకుల పాఠశాలలో విద్యార్థులతో భువనేశ్వరి సమావేశం నిర్వహించారు.


ఈ సందర్భంగా పలు కీలక సూచనలు చేశారు. ముందుగా గురుకుల పాఠశాల ప్రాంగణంలో.... రూ.3.50కోట్ల పూర్వ విద్యార్థుల విరాళాలతో నిర్మించిన హాస్టల్ భవనాన్ని ప్రారంభించారు. విద్యార్థులతో తన బాల్య స్మృతులను పంచుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడారు భువనేశ్వరి. విద్యార్థులు ఆంగ్లంలో ప్రతిభ కనబర్చేలా అధ్యాపకులు చూడాలని సూచించారు. తానూ నిమ్మకూరు రావడం స్వీట్ మెమరీ అని.. ఇది మా తాత లక్ష్మయ్య ఊరని చెప్పుకొచ్చారు. చిన్నప్పుడు సెలవులు వస్తే అమ్మ, తమను నిమ్మకూరు పంపించేదని అన్నారు. వేసవి సెలవులకు ఇక్కడికే వచ్చే వాళ్లమని, ఇక్కడ తన సోదరితో కాలక్షేపం చేశానని నారా భువనేశ్వరి గుర్తుచేసుకున్నారు.


ఇవి కూడా చదవండి...

వేల సిమ్ కార్డులు, టెక్నో పరికరాలతో కోట్లల్లో ఫ్రాడ్.. చివరకు పాపం పండి

నిమ్మకూరు రావడం ఓ స్వీట్ మెమోరీ: భువనేశ్వరి

Read Latest AP News And Telugu News

Updated Date - Dec 26 , 2025 | 04:24 PM