Share News

Bhuvaneshwari: నిమ్మకూరు రావడం ఓ స్వీట్ మెమోరీ: భువనేశ్వరి

ABN , Publish Date - Dec 26 , 2025 | 03:06 PM

నిమ్మకూరులో నారా భువనేశ్వరి పర్యటించారు. విద్యార్థులతో మాట్లాడిన భువనమ్మ.. నిమ్మకూరుకు రావడం అదృష్టంగా భావిస్తున్నట్లు ఆనందం వ్యక్తం చేశారు.

Bhuvaneshwari: నిమ్మకూరు రావడం ఓ స్వీట్ మెమోరీ: భువనేశ్వరి
Nara Bhuvaneshwari

కృష్ణా జిల్లా, డిసెంబర్ 26: విద్యార్థులు సమాజాన్ని, దేశాన్ని లీడ్ చేసేలా ఉండాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు సతీమణి, ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ చైర్మన్ నారా భువనేశ్వరి (Nara Bhuvaneshwari) అన్నారు. ఈరోజు (శుక్రవారం) నిమ్మకూరులో పర్యటించిన భువనమ్మ.. గురుకుల పాఠశాల్లో విద్యార్థులతో సమావేశం నిర్వహించి.. వారితో తన బాల్య స్మృతులను పంచుకున్నారు. స్కూల్ చదువు పూర్తి చేసుకుని బయటకు వచ్చే సమయంలో జీవితంలో ఒక లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. విద్యార్థులు ఆంగ్లంలో ప్రతిభ కనబర్చేలా అధ్యాపకులు చూడాలన్నారు. తాను నిమ్మకూరు రావడం స్వీట్ మెమోరీ అని.. ఇది తన తాత లక్ష్మయ్య ఊరు అని తెలిపారు. చిన్నపుడు సెలవులు వస్తె అమ్మ తమను నిమ్మకూరుకు పంపేదని... వేసవి సెలవలకు ఇక్కడికే వచ్చే వాళ్ళమని చెప్పుకొచ్చారు.


ఇక్కడ తన సోదరి శారద ఉండేదని.. ఆర్టీసీ బస్‌లో పామర్రు సినిమా వెళ్ళేవాళ్ళమంటూ ఆనాటి జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు. కాలం మారుతుందని.. ఇప్పుడు ఫోన్, కార్లు కావాలని కోరుకుంటున్నారని అన్నారు. బాలికలు వ్యక్తిత్వ వికాసాన్ని పెంపొందించుకోవాలని సూచించారు. ఈ రోజు మీరు చేసే పనే రేపటి జీవితానికి దారి చూపుతుందని వెల్లడించారు. పెద్ద పెద్ద నాయకులు చాలా కష్టపడి చదువుకున్నారని.. అన్ని ఉండి చదువుకునే వారిని కాకుండా పేదరికంలో ఉండి చదువుకునే వారిని స్పూర్తిగా తీసుకోవాలన్నారు. నాన్న ఇంటింటికీ తిరిగి పాలు అమ్మి కష్టపడి పైకి వచ్చారని.. తాము ఈ స్థాయిలో ఉన్నాము అంటే తమ తల్లిదండ్రుల కష్టమని గర్వంగా చెప్పుకున్నారు.


సీఎం చంద్రబాబు కూడా చాలా కష్టపడి చదువుకున్నారని తెలిపారు. చంద్రబాబుపై నమ్మకంతో ఉమ్మడి రాష్ట్రంలో, విభజన తర్వాత సీఎంగా ఎన్నుకున్నారన్నారు. ఇంటింటికి రూ.15 వేలు ఇస్తామన్నారని.. 54 లక్షల మంది తల్లులకు తల్లికి వందనం ఇస్తున్నారని.. ఇందుకోసం రూ.10 వేల కోట్లు ఖర్చు అవుతుందని తెలిపారు. ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా ఎంత సేవ చేయాలో అంత చేస్తున్నామన్నారు. తమను నమ్మి ఎంతోమంది దాతలు ముందుకు వస్తున్నారని అన్నారు.ఈరోజు ఇక్కడికి రావడం అదృష్టంగా భావిస్తున్నట్లు ఆనందం వ్యక్తం చేశారు. స్కూల్స్‌లో ఉన్న సమస్యలను సీఎం, కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారం అయ్యేలా చూస్తానని భువనేశ్వరి పేర్కొన్నారు.


ఇవి కూడా చదవండి...

శివానికి రాష్ట్రీయ బాలపురస్కార్

వేల సిమ్ కార్డులు, టెక్నో పరికరాలతో కోట్లల్లో ఫ్రాడ్.. చివరకు పాపం పండి

Read Latest AP News And Telugu News

Updated Date - Dec 26 , 2025 | 03:15 PM