AP CID: వేల సిమ్ కార్డులు, టెక్నో పరికరాలతో కోట్లల్లో ఫ్రాడ్.. చివరకు పాపం పండి
ABN , Publish Date - Dec 26 , 2025 | 01:12 PM
సైబర్ నేరాలకు పాల్పడుతున్న కీలక నిందితుడిని ఏపీ సీఐడీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సైబర్ నేరాలపై సంచలన విషయాలను సీఐడీ డీజీ మీడియాకు తెలియజేశారు.
అమరావతి, డిసెంబర్ 26: సైబర్ నేరాలకు పాల్పడే కీలక నిందితుడిని ఏపీ సీఐడీ పోలీసులు (AP CID) అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి వేల సంఖ్యలో సిమ్ కార్డులతో పాటు, పలు కంప్యూటర్‌లు, ఇతర సాంకేతిక పరికరాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దీనిపై సీఐడీ డీజీ ఆసిఫ్ ఖాన్ మీడియాతో మాట్లాడుతూ.. సైబర్ నేరాలకు పాల్పడుతున్న ఇంటర్నేషనల్ మోసగాడిని అరెస్టు చేశామన్నారు. ఈ మోసాలకు పాల్పడేందుకు అనేక రకాల అధునాతన సాంకేతిక పరికరకాలు వాడుతున్నారని తెలిపారు. వారి నుంచి అనేక పరికరాలను స్వాధీనం చేసుకున్నామన్నారు. ఇంటర్నేషనల్ కాల్స్‌ను లోకల్ కాల్‌గా మార్చి చూపుతున్నారని.. దీంతో చాలా మంది కాల్స్ మాట్లాడటం ద్వారా మోసపోతున్నారని చెప్పారు.
దేశ వ్యాప్తంగా పది వేల కోట్ల వరకు మోసం చేశారని.. ఒక్క ఏపీలో ఇరవై కోట్లు వరకు మోసం చేశారన్నారు. ఈ విధంగా అనేక దేశాల వారిని మోసం చేశారని... ఒకేసారి 64 సిమ్‌లతో వీరు కాల్స్ చేస్తున్నారని సీఐడీ డీజీ చెప్పారు. వేలకోట్ల రూపాయలు మోసాల ద్వారా దోచుకున్నారని తెలిపారు. సిమ్ బాక్స్ ద్వారా, మాడ్యూల్స్ ద్వారా వీరు ఆపరేషన్ చేస్తున్నారన్నారు. ఎక్కడ నుంచి కాల్ చేసేది తెలియకుండా మోసాలకు పాల్పడుతున్నారన్నారు. టెలిగ్రామ్ యాప్ ద్వారా వీరు మోసపూరిత లింక్‌లు పంపిస్తున్నారని అన్నారు. ఫేక్ కేవైసీ చేసి ఈ ముఠా సిమ్ కార్డులు సంపాదిస్తున్నారని చెప్పారు. ఏ సిమ్ ఎప్పుడు ఎలా ఆపరేట్ చేయాలో టెలిగ్రామ్ యాప్ ద్వారా వారికి సంకేతాలు పంపుతారని.. ఇదంతా పెద్ద ఆర్గనైజ్ క్రైంగా జరుగుతుందని వివరించారు.
ఇందులో చాలా మందికి భాగస్వామ్యం ఉందన్నారు. కొంతమంది తెలిసి, మరికొందరు తెలియక ఈ ముఠాతో భాగస్వామ్యం అవుతున్నారని.. ప్రజలు కూడా వీటిపై అవగాహన పెంచుకోవాలని సూచించారు. అజ్ఞాత వ్యక్తులు నుంచి వచ్చే కాల్స్ పట్ల అలెర్టుగా ఉండాలన్నారు. ఒక్క చోటే కూర్చుని అనేక దేశాల ప్రజలను వీరు మోసం చేస్తున్నారని సీఐడీ డీజీ ఆసిఫ్ ఖాన్ వెల్లడించారు.
ఇవి కూడా చదవండి...
నకిలీ మద్యం కేసులో కీలక పరిణామం
శివానికి రాష్ట్రీయ బాలపురస్కార్
Read Latest AP News And Telugu News