Bal Puraskar 2025: శివానికి రాష్ట్రీయ బాలపురస్కార్
ABN , Publish Date - Dec 26 , 2025 | 11:55 AM
యువ పారా అథ్లెట్ శివాని ప్రతిష్టాత్మక అవార్డును అందుకున్నారు. శివానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రాష్ట్రీయ బాల పురస్కార్ అవార్డును ప్రదానం చేశారు.
న్యూఢిల్లీ, డిసెంబర్ 26: దేశ రాజధాని ఢిల్లీలో వీర్ బాల్ దివస్ ఘనంగా నిర్వహించారు. వివిధ రంగాల్లో అత్యుత్తమ విజయాలు సాధించిన పిల్లలకు ప్రధాన మంత్రి రాష్ట్రీయ బాల్ పురస్కారాలను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (President Droupadi Mmurmu ) అందజేశారు. తెలుగు రాష్ట్రాల నుంచి ఇద్దరు ప్రధాన మంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్ అందుకున్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదగా ఏపీకి చెందిన పారా అథ్లెట్ శివాని (Young Para-athlete Shivani ) రాష్ట్రీయ బాల పురస్కార్ అందుకున్నారు. శివాని స్వస్థలం ఆంధ్రప్రదేశ్ కర్నూలు జిల్లా మద్దికెర గ్రామం. గత నాలుగేళ్లగా జావెలిన్ త్రో, షాట్‌పుట్‌లో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో అత్యుత్తమ్మ ప్రతిభ కనబరుస్తున్నందుకు శివానిని ఈ పురస్కారానికి ఎంపిక చేశారు. అలాగే తెలంగాణకు చెందిన పడకంటి విశ్వనాథ్ కార్తికేయకు రాష్ట్రపతి ముర్ము రాష్ట్రీయ బాల పురస్కార్ అందించారు. విశ్వనాథ్ కార్తికేయ తెలంగాణ మేడ్చల్ మల్కాజ్‌గిరి వాసి.
కాగా.. కర్నూలు జిల్లా మద్దికెరకు చెందిన శివానికి పుట్టుకతోనే ఆమె కుడిచేయి మోచేతి వరకే ఉంటుంది. అయినప్పటికీ ఆమె తల్లిదండ్రులు ఆమె భవిష్యత్‌క కోసం ఎంతో కష్టపడ్డారు. చిన్నప్పటి నుంచి చదువుతో పాటు క్రీడల్లో కూడా ఎంతో ఉత్సాహం కనబరిచేది. నవోదయా స్కూల్ ప్రిన్సిపాల్ ప్రోత్సాహంతో హైదరాబాద్‌లోని ఆదిత్య మెహతా ఫౌండేషన్‌లో శివాని పారా అథ్లెటిక్స్‌లో శిక్షణ తీసుకుంటోంది. 2023లో విశాఖలో జరిగిన దివ్యాంగుల పోటీల్లో జావెలిన్ త్రో, షాట్‌పుట్‌లో శివాని బంగారు పతకాలు సాధించింది. ఆపై జాతీయ స్థాయి క్రీడలకు ఎంపికై అత్యుత్తమ ప్రతిభ కనబరిచింది. జాతీయస్థాయిలోనే కాకుండా అంతర్జాతీయ స్థాయిలోనూ శివాని పతకాలను సాధించింది. దుబాయిలో జరిగిన పారా యూత్ ఏసియన్ గేమ్స్, ఢిల్లీలో జరిగిన గ్రాండ్ ప్రిక్స్ పోటోల్లో కూడా పాల్గొని తన సత్తా చాటింది శివాని.
ఇవి కూడా చదవండి...
అనుమానంతో భార్యకు నిప్పు పెట్టిన భర్త.. అడ్డుకోబోయిన కూతురిని కూడా
నకిలీ మద్యం కేసులో కీలక పరిణామం
Read Latest AP News And Telugu News