Home » Medical News
గ్లోబల్ కేపబులిటీ సెంటర్ జీసీసీను విశాఖపట్నంలో ఏర్పాటు చేస్తున్నామని, దీనికి రాష్ట్రప్రభుత్వం సహకరిస్తోందని ప్రముఖ ఫార్మా కంపెనీ ఇసాయ్ గ్లోబల్ సీఈవో మకోటో హోకెట్స్ ప్రకటించారు.
వికారాబాద్ జిల్లా పరిగిలోని ఒక ప్రైవేటు ఆస్పత్రిలో ఆరు నెలల గర్భిణికి అబార్షన్ చేసిన ఉదంతం ఉద్రిక్తతకు దారితీసింది. తమకు తెలియకుండా అబార్షన్ చేశారని ఆమె అత్తమామలు, వారి తరపు బంధువులు ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగారు.
యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో ఆదివారం అర్ధరాత్రి అమానుష ఘటన వెలుగుచూసింది. పట్టణానికి చెందిన గాయత్రి ఆస్పత్రిలో లింగనిర్ధారణ పరీక్షలు చేసి ఇద్దరికి అబార్షన్లు చేసినట్లుగా సమాచారం అందుకున్న ఎస్‌వోటీ పోలీసులు ఆస్పత్రిపై దాడులు చేశారు.
రాష్ట్రంలో వైద్యవిద్యను గాడిన పెట్టే క్రమంలో సర్కారు రికార్డు స్థాయిలో అధ్యాపకుల నియామక ప్రక్రియను చేపట్టింది. ప్రభుత్వ వైద్య కళాశాలల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులను భారీగా భర్తీ చేసేందుకు సిద్ధమైంది.
కొత్త టిమ్స్ హాస్పిటల్స్, వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌లో మెడికల్, డయాగ్నస్టిక్స్ ఎక్విప్‌మెంట్, ఫర్నీచర్ త్వరగా కొనుగోలు చేయాలని ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని, అత్యాధునిక టెక్నాలజీతో కూడిన ఎక్విప్‌మెంట్ కొనుగోలు చేయాలని సూచించారు.
రాష్ట్రంలో ఈఎ్‌సఐ ఆస్పత్రులు, డిస్పెన్సరీలకు వెళ్లడానికి రోగులు తటపటాయిస్తున్నారు. భారీగా ఓపీ పడిపోతుండడంతో డిస్పెన్సరీలు ఒక్కొక్కటిగా మూతపడుతున్నాయి.
దేశంలో వైద్య విద్యలో కీలక సంస్కరణలకు కేంద్ర ప్రభుత్వం నాంది పలికింది. పెరుగుతున్న డిమాండ్‌కు అనుగుణంగా స్పెషలిస్టు వైద్యుల సంఖ్యను పెంచేందుకు చర్యలు ప్రారంభించింది.
పలు రాష్ట్రాలకు ఈ స్కామ్‌లో సంబంధం ఉండటంతో పాటు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖకు చెందిన ఉన్నతాధికారులు, నేషనల్ మెడికల్ కమిషన్, మధ్యవర్తులు, ప్రైవేటు కాలేజీ ప్రతినిధులు, ప్రముఖ విద్యావేత్తలు, ఒక స్వయం ప్రకటిత గాడ్‌మెన్ ప్రమేయం ఉన్నట్టు సీబీఐ తెలిపింది.
ప్రైవేటు హాస్పిటళ్లలో పనిచేసే వైద్యులకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఓ కీలక సూచన చేశారు. ఏడాదిలో కనీసం నెల రోజులపాటు ప్రభుత్వ ఆస్పత్రుల్లో పనిచేయాలని కోరారు.
వైసీపీ హయాంలో అప్పటి ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డికి చెప్పి మెడికల్ సీటు ఇప్పిస్తానంటూ ఆయన సన్నిహితుడు రూ. 1.20 కోట్లు నొక్కేశాడు. బెంగళూరు రామయ్య మెడికల్ కళాశాలలో సీటు వచ్చినట్లుగా నకిలీ ఆఫర్ లెటర్ చేతికి ఇచ్చి ఘోరంగా మోసం చేశాడు