Share News

అంబటి రాంబాబుకు బిగ్ షాక్.. పీటీ వారెంట్ జారీ

ABN , Publish Date - Feb 08 , 2026 | 02:04 PM

మాజీ మంత్రి, వైసీపీ కీలక నేత అంబటి రాంబాబుకు పోలీసులు పీటీ వారెంట్ దాఖలు చేశారు. మెడికల్ కాలేజీల పీపీపీ మోడల్‌ని వ్యతిరేకిస్తూ ఆందోళనలో బారికేడ్లు తోసుకుని వెళ్లిన ఘటనపై గతంలోనే అంబటి రాంబాబుపై కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే.

అంబటి రాంబాబుకు బిగ్ షాక్.. పీటీ వారెంట్ జారీ
Ambati Rambabu

గుంటూరు జిల్లా, ఫిబ్రవరి 8 (ఆంధ్రజ్యోతి): మాజీ మంత్రి, వైసీపీ కీలక నేత అంబటి రాంబాబు (Ambati Rambabu) కేసుకు సంబంధించి పోలీసులు పీటీ వారెంట్ దాఖలు చేశారు. గతేడాది నవంబర్ 12న మెడికల్ కాలేజీల పీపీపీ (PPP) మోడల్‌ని వ్యతిరేకిస్తూ ఆందోళన చేపట్టిన అంబటి.. పోలీసులు ఏర్పాటు చేసిన బారికేడ్లు తోసుకుని వెళ్లారు. ఈ ఘటనపై అప్పట్లోనే పట్టాభిపురం పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు అయ్యింది. అంబటి రాంబాబు అప్పట్లో పోలీసులు అడ్డుకున్నా.. బారికేడ్లను తోసుకుని ఆందోళనలో పాల్గొన్నారని, ఈ విషయంపై కేసు దర్యాప్తు జరుగుతోందని పోలీసులు పీటీ వారెంట్ లో ప్రస్తావించారు.


కోర్టుకు అంబటి..

పోలీసులు ఈనెల (ఫిబ్రవరి) 11వ తేదీ లోపు అంబటి రాంబాబును కోర్టులో హాజరుపరచాలని ఆదేశించారు. దీంతో అంబటిని రేపు(సోమవారం) మొబైల్ కోర్టులో ప్రవేశపెట్టే అవకాశం ఉందని సమాచారం. అంబటి రాంబాబుకు సంబంధించిన కస్టడీ పిటిషన్‌పై రేపు మొబైల్ కోర్టు తీర్పు ప్రకటించనుంది.


ఈ వార్తలు కూడా చదవండి..

చిత్తూరు జిల్లాలో ఏనుగుల హల్‌చల్‌.. భయాందోళనలో ప్రజలు..

శ్రీకాకుళం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం..

Read Latest Telangana News And AP News And Telugu News

Updated Date - Feb 08 , 2026 | 03:38 PM