Share News

Medical Store: మెడికల్ స్టోర్‌ నిర్వహణకు ఎలాంటి కోర్స్ అవసరం.. అనుమతి ఎలా పొందాలంటే?

ABN , Publish Date - Jan 06 , 2026 | 08:32 PM

ఈ రోజుల్లో ఆరోగ్యానికి సంబంధించి ఏ చిన్న ఇబ్బంది వచ్చినా వెంటనే మెడికల్ స్టోర్‌కు వెళ్లి మాత్రలు, సిరప్‌లు తెచ్చుకోవడం సర్వసాధారణం అయ్యింది. జీవనోపాధికి సొంతంగా మెడికల్ స్టోర్ పెట్టాలని చాలా మందికి ఉన్నా.. మెడిసిన్స్ విషయంలో అనుభవం ఉండాలేమో, అనుమతి ఎలా లభిస్తుందన్న గందరగోళంలో ఉన్నారు.

Medical  Store: మెడికల్ స్టోర్‌ నిర్వహణకు ఎలాంటి కోర్స్ అవసరం.. అనుమతి ఎలా పొందాలంటే?
How to Open a Medical Store in India,

ఇంటర్నెట్ డెస్క్: ఈ రోజుల్లో మెడికల్ స్టోర్ (Medical Store) లాభదాయకమైన వ్యాపారం (business) అని కొందరు భావిస్తుంటారు. మెడికల్ షాప్ నిర్వహణకు కొన్ని నియమాలు, నిబంధనలు ఉన్నాయి. ప్రస్తుతం చాలా మంది యువత ప్రభుత్వ ఉద్యోగాల(Government jobs) కోసం వెయిట్ చేయకుండా సొంత వ్యాపారాలపై దృష్టి పెడుతున్నారు. స్వయం ఉపాధి కోసం(self employment) ఎన్నో రకాల మార్గాలు ఎంచుకుంటున్నారు. నేటి సమాజంలో ఎక్కువ డిమాండ్ ఉన్న వ్యాపారం ఏదైనా ఉందంటే.. అది మెడికల్ స్టోర్ అని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. గ్రామాలు, పట్టణాలు ప్రతిచోట మెడికల్ స్టోర్లు ఏర్పాటు చేస్తున్నారు. సరైన ప్రదేశం, సరైన నిబంధనలతో స్టోర్ ప్రారంభిస్తే.. మంచి లాభాలు ఉంటాయని వ్యాపార నిపుణులు చెబుతున్నారు.


సాధారణంగా మెడికల్ షాప్ పెట్టాలంటే దానికి సంబంధించిన కోర్సు(courses)లను పూర్తి చేసి ప్రభుత్వ అనుమతి పొందాలి. సరైన డిగ్రీ, లైసెన్స్ లేకుండా స్టోర్ ఓపెన్ చేయడానికి వీల్లేదు. అలా చేస్తే చట్టవిరుద్ధంగా పరిగణిస్తూ భారీ జరిమానాలు కట్టడమే కాకుండా షాప్ మూసివేయాల్సిన పరిస్థితి వస్తుంది. మెడికల్ స్టోర్ నిర్వహించేందుకు ఫార్మసీ(Pharmacy) సంబంధిత డిగ్రీ లేదా డిప్లొమా(Diploma) చేయాల్సి ఉంటుంది. డిప్లొమా ఇన్ ఫార్మసీ(D.Pharm).. ఇది 2 సంవత్సరాల్లో పూర్తవుతుంది. దీనికి ప్రత్యామ్నాయంగా బ్యాచిలర్ ఇన్ ఫార్మసీ(B.Pharm) కూడా చేయవచ్చు. ఇది నాలుగేళ్ల డిగ్రీ కోర్సు. ఈ కోర్సులో మెడిసిన్స్ గుర్తింపు, నిల్వ, పంపిణీ, వైద్య శాస్త్రాలలో ట్రైనింగ్ ఇస్తారు. కోర్సు పూర్తి చేసి సర్టిఫికెట్ మన వద్ద ఉంటే మెడికల్ స్టోర్‌ను నిర్వహించేందుకు చట్టబద్దంగా అర్హులవుతారు.


అన్ని అర్హతలు ఉండి మెడికల్ స్టోర్ ప్రారంభించడానికి.. ఫార్మసీ కౌన్సిల్, రాష్ట్ర ప్రభుత్వం నుంచి లైసెన్స్ పొందాలి. ఇందుకోసం ముందుగా రాష్ట్ర ఫార్మసీ చట్టం కింద దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తుతో పాటు డి.ఫార్మసీ, బి.ఫార్మసీ డిగ్రీ, స్టోర్ చిరునామా, స్టోర్ అద్దె లేదా సొంతమా అనే విషయానికి సంబంధించిన పత్రాలు సమర్పించాల్సి ఉంటుంది. లైసెన్స్ వచ్చిన తర్వాత మెడికల్ స్టోర్ ఏర్పాటు చేసుకోవచ్చు. డ్రగ్ ఇన్‌స్పెక్టర్ల ఆడిట్, తనిఖీలకు సంబంధించిన నియమాలు తప్పకుండా పాటించాలి. లేదంటే లైనెన్స్ రద్దు చేసే అవకాశం ఉంటుంది.


‌‌ఇవీ చదవండి:

సోనియా గాంధీకి అస్వస్థత.. ఆస్పత్రిలో అడ్మిట్..

స్టాలిన్ ప్రభుత్వానికి షాక్.. కార్తీక దీపం వెలిగించడానికి అనుమతి..

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jan 06 , 2026 | 09:10 PM