Share News

Kodali Nani: వైసీపీ నేత, మాజీ మంత్రి కొడాలి నాని బెయిల్ షరతులకు నేటితో విముక్తి

ABN , Publish Date - Aug 30 , 2025 | 07:45 PM

వైసీపీ నేత కొడాలి నానికు నేటితో విముక్తి లభించింది. ఆయన బెయిల్ షరతుల గడువు నేటితో పూర్తి అయింది. మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరావు వస్త్ర దుకాణంపై దాడి కేసులో బెయిల్ పొందిన కొడాలి నానికు..

Kodali Nani: వైసీపీ నేత, మాజీ మంత్రి కొడాలి నాని బెయిల్ షరతులకు నేటితో విముక్తి
Kodali Nani

గుడివాడ, ఆగస్టు 30 : వైసీపీ నేత, కృష్ణాజిల్లా గుడివాడ మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కొడాలి నానికు నేటితో విముక్తి లభించింది. ఆయన బెయిల్ షరతుల గడువు నేటితో పూర్తి అయింది. మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరావు వస్త్ర దుకాణంపై దాడి కేసులో బెయిల్ పొందిన కొడాలి నానికు.. గుడివాడ వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో ప్రతి మంగళ, శనివారాల్లో సంతకాలు చేయాలని షరతులు విధించి కోర్టు బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే.


దీనిపై కొడాలి నాని పై కోర్టుకు వెళ్లడంతో శనివారం ఒక్కరోజు సంతకాలు చేస్తే సరిపోతుందంటూ హైకోర్టు షరతుల్ని సడలించింది. అయితే, రెండు నెలలపాటు సంతకాలు చేయాలన్న హైకోర్టు ఆదేశాలు కూడా నేటితో పూర్తి అవడంతో కొడాలి నాని ఇక పోలీస్ స్టేషన్ కు వెళ్లి సంతకాలు చేయాల్సిన పరిస్థితి లేకుండాపోయింది.


ఈ వార్తలు కూడా చదవండి..

ఇన్‌ఫార్మర్‌ నెపంతో గిరిజనుడి హత్య

గణేశుడి మండపం వద్ద కరెంట్‌ షాక్‌తో బాలుడి మృతి

Read Latest Telangana News and National News

Updated Date - Aug 30 , 2025 | 07:58 PM