Minister Subhash: పులులు, సింహాలన్నారు.. గ్రామ సింహాలయ్యారు.. కొడాలిపై మంత్రి ఎద్దేవా
ABN , Publish Date - Dec 13 , 2025 | 02:19 PM
కొడాలి నానిపై మంత్రి సుభాష్ సెటైరికల్ కామెంట్స్ చేశారు. పులులు, సింహాలు అంటూ ఇప్పుడు గ్రామ సింహాలుగా మారిపోయారంటూ ఎద్దేవా చేశారు.
అమరావతి, డిసెంబర్ 13: మాజీ మంత్రి కొడాలి నానికి (Former Minister Kodali Nani) కార్మికశాఖ మంత్రి సుభాష్ (Minister Subhash) స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ.. మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి సంతోషం కోసం కొడాలి నాని నోటికి వచ్చినట్టు బూతులు మాట్లాడారని మండిపడ్డారు. రెడ్ బుక్ పేరెత్తితేనే గజగజ లాడిపోతున్నారంటూ వ్యాఖ్యలు చేశారు. అవాకులు చవాకులు పేలాటం ఎందుకు ఇప్పుడు డైపర్లు వేసుకు తిరగడం ఎందుకు అంటూ ఎద్దేవా చేశారు. పులులు, సింహాలు అంటూ ఇప్పుడు గ్రామ సింహాలుగా మారిపోయారంటూ సెటైరికల్ కామెంట్స్ చేశారు. ముందు యోగా, వాకింగ్ చేసి ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకో అంటూ కొడాలి నానికి హితవుపలికారు.
మెడికల్ కాలేజీల విషయంలో వైసీపీ నేతల సంతకాల సేకరణ ఓ బోగస్ అని అన్నారు. వైసీపీ కార్యకర్తలు సంతకాలు పెట్టి పెట్టి వాళ్ళ చేతులు పడిపోతున్నాయంటూ ఎద్దేవా చేశారు. 151 యొక్క సీట్ల నుంచి 11 సీట్లకు ఎందుకు దిగజారేమో సంతకాల సేకరించాలని అన్నారు. కూటమి ప్రభుత్వ హయాంలో అభివృద్ధి విషయంలో విశాఖ దూసుకుపోతోందన్నారు. వైసీపీ హయాంలో విశాఖను గంజాయి హబ్‌గా, కబ్జాలకు కేంద్రంగా మార్చారని మండిపడ్డారు.
విశాఖ అభివృద్ధిని చూసి వైసీపీ నేతలు ఓర్చుకోలేకపోతున్నారని ఫైర్ అయ్యారు. కక్ష సాధింపు చర్యలలో భాగంగా చంద్రబాబుపై పెట్టిన కేసులు ఒక్కొకటిగా వీగిపోతున్నాయని తెలిపారు. చంద్రబాబుని చూసి నేర్చుకుంటే ఇంకో 25 సంవత్సరాల తర్వాత అయినా అధికారం కోసం పోటీపడే అవకాశం ఉంటుంది అంటూ మంత్రి సుభాష్ పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి...
త్వరలోనే లాటరీ విధానంలో ప్లాట్ల కేటాయింపు: మంత్రి నారాయణ
రోజాపై టీడీపీ నగరి నేతల ఫైర్...
Read Latest AP News And Telugu News