TDP Leaders: రోజాపై టీడీపీ నగరి నేతల ఫైర్...
ABN , Publish Date - Dec 13 , 2025 | 01:39 PM
రోజా ఫస్ట్రేషన్‌లో మదమెక్కి మాట్లాడుతున్నారని టీడీపీ నేతలు వ్యాఖ్యలు చేశారు. రోజా ఇక జీవితంలో నగరిలో గెలవదని స్పష్టం చేశారు.
తిరుపతి, డిసెంబర్ 13: మాజీ మంత్రి రోజాపై (Former Minister Roja) టీడీపీ నగరి నేతలు (Nagari TDP Leaders) నిప్పులు చెరిగారు. నగరిలో తాము పెట్టిన భిక్షే రోజా రాజకీయ జీవితమన్నారు. ఇక జీవితంలో రోజా నగరిలో గెలవలేదని స్పష్టం చేశారు. తాము పార్టీ మారడానికి రోజానే కారణమని ఫైర్ అయ్యారు. రోజా ఫస్ట్రేషన్‌లో మదమెక్కి మాట్లాడుతోందంటూ టీడీపీ నేతలు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. శనివారం నాడు.. మాజీ శ్రీశైలం బోర్డు చైర్మన్ రెడ్డివారి చక్రపాణిరెడ్డి, వడమాలపేట జడ్పీటీసీ మురళీధర్ రెడ్డి, విజయపురం ఎంపీపీ లక్ష్మీపతిరాజు, నిండ్ర ఎంపీపీ భాస్కర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ రోజాపై విమర్శలు గుప్పించారు.
మేము పెట్టిన భిక్షే: చక్రపాణి రెడ్డి
నగరిలో తాము పెట్టిన భిక్షే రోజా రాజకీయ జీవితమని మాజీ శ్రీశైలం బోర్డు చైర్మన్ చక్రపాణి రెడ్డి అన్నారు. ఎంపీపీ ఎన్నికలు న్యాయబద్ధంగానే జరిగాయన్నారు. ఓ అబ్బకు పుట్టావా అంటూ రోజా మాట్లాడటం బాధాకరమన్నారు. ‘రోజా నువ్వు ఎవరికి పుట్టావో తెలుసుకో.. నువ్వు టెస్ట్ చేసుకో.. నువ్వు ఒక ఆడదానివేనా. నగరి నియోజకవర్గ చరిత్రలో అత్యంత దారుణంగా ఓడిపోయింది నువ్వే’ అంటూ వ్యాఖ్యలు చేశారు. ఇక జీవితంలో రోజా నగరి నియోజకవర్గంలో గెలవదని హెచ్చరించారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలలో తమ సత్తా ఏంటో చూపిస్తామని చక్రపాణి రెడ్డి స్పష్టం చేశారు.
మా దయ వల్లే గెలిచావు: మురళీధర్ రెడ్డి
రోజా ఫస్ట్రేషన్‌లో మదమెక్కి మాట్లాడుతున్నారని వడమాలపేట జడ్పీటీసీ మురళీధర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము పార్టీ మారిన వాళ్లం కాదని.. రోజానే 2004 నగరిలో, 2009లో చంద్రగిరిలో టీడీపీ నుంచి ఓటమి పాలై పార్టీ మారి తమ దయవల్ల నగరి ఎమ్మెల్యేగా గెలిచినట్లు తెలిపారు. పుట్టుక గురించి రోజా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. 2014 ముందు రోజా ఆర్థిక పరిస్థితి ఏమిటి..? ఇప్పుడు ఏంటని ప్రశ్నించారు. ‘విడిచి పెట్టింది ఊరికి పెద్దా’ అన్నట్లుంది రోజా వ్యవహారమని విమర్శలు గుప్పించారు.
సత్తా ఉంటే గెలువు..
‘మా చరిత్ర తెలుసుకో రోజా.. అబ్బా అమ్మా అంటే ఏమిటో తెలుసుకో. నువ్వు అడుక్కుతింటుంటే మేము సాయం చేశాం. నువ్వు నీ కుటుంబం నగరిని దోచుకున్నారు. మేము పార్టీ మారడానికి కారణం నువ్వే. నోరుంది కదా అని నోటికొచ్చినట్లు మాట్లాడితే సహించం. సత్తా ఉంటే గెలువు చూద్దాం… నోరు అదుపులో పెట్టుకో. రోజా నోరు వల్లనే వైసీపీకి ఈ గతి పట్టింది’ అంటూ మరో సీనియర్ నేత అమ్ములు వ్యాఖ్యలు చేశారు.
ఇవి కూడా చదవండి...
ఆ రైతులతో మరోసారి మాట్లాడతాం: పెమ్మసాని చంద్రశేఖర్
త్వరలోనే లాటరీ విధానంలో ప్లాట్ల కేటాయింపు: మంత్రి నారాయణ
Read Latest AP News And Telugu News