Share News

AP Government: వాహనదారులకు అలర్ట్.. నేటి నుంచి ఆ రూట్‌లో వెళ్లకండి..

ABN , Publish Date - Dec 13 , 2025 | 12:05 PM

చింతూరు టూ మారేడుమిల్లి ఘాట్ రోడ్డు ప్రయాణంపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆంక్షలు విధించింది. రాత్రి వేళ ఘాట్ రోడ్డుపై ప్రయాణం చేయకుండా ఆంక్షల ఉత్తర్వులు జారీ చేశారు చింతూరు ఐటీడీఏపీవో శుభం నోక్‌వాల్.

AP Government: వాహనదారులకు అలర్ట్.. నేటి నుంచి ఆ రూట్‌లో వెళ్లకండి..
AP Government

అమరావతి, డిసెంబరు13 (ఆంధ్రజ్యోతి): చింతూరు టూ మారేడుమిల్లి ఘాట్ రోడ్డు ప్రయాణంపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం (Andhra Pradesh Government) ఆంక్షలు విధించింది. రాత్రి వేళ ఘాట్ రోడ్డుపై ప్రయాణం చేయకుండా ఆంక్షల ఉత్తర్వులు జారీ చేశారు చింతూరు ఐటీడీఏపీవో శుభం నోక్‌వాల్. భద్రాచలం నుంచి రాత్రి వేళ ఆంధ్రప్రదేశ్ వెళ్లే వాహనదారులకు ఆంక్షలపై ప్రభుత్వం ఈ విజ్ఞప్తి చేసింది.


ప్రజా భద్రత కోసం ఆంక్షలు నేటి నుంచి అమల్లోకి రానున్నాయని ఏపీ సర్కార్ తెలిపింది. అల్లూరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం నేపథ్యలో ప్రభుత్వం ఈ ఆంక్షలు విధించింది. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు ఈ ప్రయాణంపై ఆంక్షలు ఉండనున్నాయి. వాహనదారులు ఈ విషయాన్ని గమనించాలని ఏపీ సర్కార్ సూచించింది.

కాగా, అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు మండలం తులసిపాకలు ఘాట్ రోడ్‌లో నిన్న(శుక్రవారం) తెల్లవారు జామున బస్సు ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో 10 మంది మృతిచెందగా.. 20మందికి తీవ్ర గాయాలయ్యాయి.


ఈ వార్తలు కూడా చదవండి..

సీఎం చంద్రబాబుకు బిగ్ రిలీఫ్.. ఫైబర్ నెట్ కేసు కొట్టివేత

శ్రీవారిని దర్శించుకున్న రజనీకాంత్

Read Latest AP News And Telugu News

Updated Date - Dec 13 , 2025 | 12:17 PM