Share News

Kodali Nani Court Violation: కోర్టు ఆదేశాలకు విరుద్ధంగా పీఎస్‌‌కు మాజీ మంత్రి

ABN , Publish Date - Jul 05 , 2025 | 12:35 PM

Kodali Nani Court Violation: కోర్టు ఆదేశాలకు విరుద్ధంగా మాజీ మంత్రి కొడాలి నాని.. పెద్ద సంఖ్యలో తన అనుచరులతో కలిసి ఇంటి వద్ద నుంచి స్టేషన్‌కు వచ్చి మరీ సంతకాలు చేశారు.

Kodali Nani Court Violation: కోర్టు ఆదేశాలకు విరుద్ధంగా పీఎస్‌‌కు మాజీ మంత్రి
Kodali Nani Court Violation

కృష్ణా జిల్లా, జులై 5: మాజీ మంత్రి కొడాలి నాని (Former Minister Kodali Nani) ఈరోజు (శనివారం) ఉదయం గుడివాడ వన్‌టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌కు వచ్చారు. ముందస్తు బెయిల్‌లో భాగంగా కోర్టు షరతుల మేరకు స్టేషన్‌లో సంతకాలు చేశారు మాజీ మంత్రి. అయితే మంది మార్బలంతో కొడాలి నాని పోలీస్‌స్టేషన్‌కు రావడం వివాదస్పదంగా మారింది. కోర్టు ఆదేశాలకు విరుద్ధంగా మాజీ మంత్రి.. పెద్ద సంఖ్యలో తన అనుచరులతో కలిసి ఇంటి వద్ద నుంచి స్టేషన్‌కు వచ్చి మరీ సంతకాలు చేశారు.


మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు వస్త్ర దుకాణంపై పెట్రోల్ ప్యాకెట్లతో జరిగిన దాడి కేసులో కొడాలి నానికి గుడివాడ కోర్టు (Gudivada Court) షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే.


ఇవి కూడా చదవండి

మీ యోగక్షేమాలు తెలుసుకోడానికే వచ్చా.. ధర్మవరంలో హోంమంత్రి

గంజాయి స్మగ్లింగ్‌లో కొత్త పంథా.. చూస్తే షాక్‌ అవ్వాల్సిందే

Read Latest AP News And Telugu News

Updated Date - Jul 05 , 2025 | 03:39 PM