Share News

Pawan Kalyan: సర్పంచ్‌ల నిర్లక్ష్యంపై పవన్ కళ్యాణ్ సీరియస్

ABN , Publish Date - Dec 10 , 2025 | 12:28 PM

పంచాయతీరాజ్ సిబ్బంది పట్ల కొందరు సర్పంచ్‌లు వ్యవహరిస్తున్న తీరుపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పని చేసిన వారికి సకాలంలో జీతాలు ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు.

Pawan Kalyan: సర్పంచ్‌ల నిర్లక్ష్యంపై పవన్ కళ్యాణ్ సీరియస్
Deputy CM Pawan Kalyan

అమరావతి, డిసెంబర్ 10: పంచాయతీరాజ్ సిబ్బంది విషయంలో పలువురు సర్పంచ్‌లు నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Deputy CM Pawan Kalyan) ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈరోజు (బుధవారం) పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ది శాఖ అధికారులు సిబ్బందితో మాటా మాంతీ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం పాల్గొన్నారు. ఈ సందర్భంగా కొన్ని గ్రామాల్లో సర్పంచ్‌లు నిర్లక్ష్యంతో వ్యవహరిస్తున్నారంటూ పవన్ దృష్టికి పంచాయతీ రాజ్ సిబ్బంది తీసుకెళ్లారు. నెలంతా కష్టపడి పని చేసినా జీతాలు, బిల్లుల విషయంలో కొన్ని చోట్ల సర్పంచ్‌లు ఇబ్బందులు పెడుతున్నారని.. సకాలంలో సంతకాలు చేయకపోవడంతో జీతాలు కూడా అందడం లేదని తెలియజేశారు. సర్పంచ్‌లు చెప్పిన విధంగా పంచాయతీ సెక్రటరీలు పని చేస్తూ సిబ్బందిని, కార్మికులను ఇబ్బందులు పెడుతున్నారని పంచాయతీ రాజ్ సిబ్బంది పవన్‌కు తెలిపారు.


దీనిపై వెంటనే స్పందించిన డిప్యూటీ సీఎం.. నిర్లక్ష్యంతో వ్యవహరిస్తున్న సర్పంచ్‌ల జాబితా సిద్ధం చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఇక నుంచి పని చేసిన వారికి ఎక్కడా జీతాలు ఆగకుండా సకాలంలో అందేలా చర్యలు ఉంటాయని హామీ ఇచ్చారు. హెచ్చరికలు చేసిన తరువాత కూడా సర్పంచ్‌లు ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తే అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.


ఇవి కూడా చదవండి..

కాలేజ్‌ భవనంపై నుంచి కిందపడ్డ విద్యార్థి.. పరిస్థితి విషమం

రెండో విడత ల్యాండ్ పూలింగ్.. రైతుల అంగీకారం

Read Latest AP News And Telugu News

Updated Date - Dec 10 , 2025 | 12:43 PM