Share News

CM Chandrababu: జగన్ హయాంలో ఏపీ‌ బ్రాండ్ దెబ్బతీశారు.. సీఎం చంద్రబాబు ఫైర్

ABN , Publish Date - Dec 10 , 2025 | 11:56 AM

కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులను సమర్థంగా వినియోగించుకోవాలని అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు. వైసీపీ విధానాలతో ప్రజలు తీవ్ర ఇబ్బందుల పాలయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు.

CM Chandrababu: జగన్ హయాంలో ఏపీ‌ బ్రాండ్ దెబ్బతీశారు.. సీఎం చంద్రబాబు ఫైర్
CM Chandrababu Naidu

అమరావతి, డిసెంబరు10 (ఆంధ్రజ్యోతి): జగన్ ప్రభుత్వ హయాంలో ఏపీ‌ బ్రాండ్ దెబ్బతీశారని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) షాకింగ్ కామెంట్స్ చేశారు. ఏపీ బ్రాండ్ దెబ్బతినడంతో అభివృద్ధి పనులు జరగలేదని చెప్పుకొచ్చారు. వైసీపీ హయాంలో నిధుల మళ్లింపు కోసం ఇష్టారీతిగా నిబంధనలు మార్చరని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ హయాంలో కేంద్ర ప్రజయోజిత పథకాలు వాడుకోకుండా పైసలను డైవర్ట్ చేయడంతో కేంద్రం రూల్స్ మార్చిందని తెలిపారు. ఇవాళ(బుధవారం) ఏపీ సచివాలయంలో ముఖ్యమంత్రి అధ్యక్షతన మంత్రులు, కార్యదర్శులు, హెచ్ఓడీలతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడారు సీఎం చంద్రబాబు.


నూతన నిబంధనలు తెచ్చాం..

వైసీపీ విధానాలతో ప్రజలు తీవ్ర ఇబ్బందుల పాలయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. సంక్షేమ, అభివృద్ధి పథకాలకు కేంద్ర ప్రభుత్వం విడుదల చేసే నిధులను వాడుకోవడానికి తమ ప్రభుత్వం నూతన నిబంధనలు తెచ్చిందని పేర్కొన్నారు. కొందరు నెగటివ్‌కు అలవాటు పడ్డారని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులను సమర్థంగా వినియోగించుకోవాలని అధికారులను ఆదేశించారు. రెవెన్యూ రికార్డులు ఇకపై కొరియర్‌లో పంపిస్తామని ప్రకటించారు. ప్రతి కంపెనీకి క్రెడిట్ రేటింగ్ ఉంటుందని.. అలాంటి వారికి అప్పులు తక్కువ వడ్డీకి ఇస్తారని వివరించారు. ప్రజలకు ఇచ్చిన హమీని నిలబెట్టకున్నామని.. సూపర్ సిక్స్‌ను సూపర్ హిట్ చేశామని పేర్కొన్నారు సీఎం చంద్రబాబు.


డేటాను ఇంటిగ్రేట్ చేశాం..

‘కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ డేటాను ఇంటిగ్రేట్ చేశాం. పబ్లిక్ పర్ఫెక్షన్‌ను ఒకప్పుడు ఇంటెలిజెన్స్ నుంచి తీసుకునేవాళ్లం. నాకు అలవాటుగా ప్రతిరోజు ఇంటెలిజెన్స్ వారిని కలుస్తా. హైదరాబాద్‌లో ఉండగా డీజీ, ఇంటెలిజెన్స్ చీఫ్, తర్వాత సీఎస్ వచ్చేవారు. చారిత్రక డేటా మన వద్ద ఉందని.. ప్రతిరోజు వారీ డేటా అప్‌డేట్ చేస్తున్నాం. అవేర్ ద్వారా రియిల్ టైం డేటా వస్తోంది. లాస్ట్ మైల్‌కు రియల్ టైంలో చేర్చగలుగుతాం. మనం టెక్నాలజీలో చాలా స్ట్రాంగ్‌గా ఉన్నాం. గ్రీన్ ఎనర్జీని అన్ని దేశాలు ప్రోత్సహిస్తున్నాయి. మైక్రోసాప్ట్ దేశంలో రూ.1. 55వేల కోట్లు పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధం అవుతోంది. ఇప్పుడు చేయాల్సింది హర్డ్ వర్క్ కాదు.. స్మార్ట్ వర్క్. ఇండస్ట్రీయల్‌ పార్కులు ఎక్కువగా ఉన్న రాష్ట్రం మనదే. ఎనర్జీ లిప్టింగ్‌కు రూ.10వేల కోట్లు ఖర్చుచేస్తున్నాం’ అని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు.


కరెంట్‌ ఛార్జీలు పెంచం..

‘రాయలసీమలో ఇప్పుడు భూగర్భ జలాలు పైకి వచ్చాయి. సౌరశక్తి వినియోగించుకుంటే విద్యుత్‌ డిమాండ్‌ తగ్గుతుంది. ఈ ఏడాది కరెంట్‌ ఛార్జీలు పెంచం. విద్యుత్‌పై పక్క రాష్ట్రాలతో బార్టర్‌ విధానం అనుసరించాం. ఏపీని విశాఖపట్నం, అమరావతి, తిరుపతి జోన్లుగా మారుస్తున్నాం. విశాఖపట్నం సమ్మిట్‌తో రూ. 13 లక్షల 26 వేలకోట్లు పెట్టబుడులు వచ్చాయి. అధికారులు ప్రజలకు జవాబుదారీతనంగా ఉండాలి. నాలెడ్జ్ ఎకానమీ దిశగా ఏపీ అడుగులేస్తోంది. అందుకే పెద్ద ఎత్తున కంపెనీలు రాష్ట్రానికి వస్తున్నాయి. విశాఖలో ఒక గిగా వాట్ డేటా సెంటర్ ఏర్పాటు కాబోతుంది. సుపరిపాలన కోసం అవసరమైతే బిజినెస్ రూల్స్ మార్చుకోవచ్చు’ అని సీఎం చంద్రబాబు తెలిపారు.


టెక్నాలజీని స్మార్ట్‌గా ఉపయోగించాలి..

‘ఆరు నెలలు ఏం చేయాలో అధికారులు, మంత్రులు ప్రణాళిక తయరు చేసుకోవాలి. రూ.50 వేల కోట్లను పెన్షన్ల రూపంలో పేదలకు ఇచ్చాం. దేవాదాయశాఖ, రెవెన్యూ శాఖ అనుకున్నంతగా పికప్ కాలేదు. అందరికీ జనవరి 15వ తేదీ డెడ్‌లైన్ విధిస్తాం. టెక్నాలజీని స్మార్ట్‌గా ఉపయోగించుకొని పని చేయాలి. పథకాలు, కార్యక్రమాలపై ఎప్పటికప్పుడు సమీక్ష చేసుకోవాలి. అనంతపురం వేరుశనగ రైతులకు తొలిసారి ఇన్‌పుట్‌ సబ్సిడీ ఇచ్చాం. అనంతపురం జిల్లాలో కరువు సమస్య తీర్చేందుకు ఇజ్రాయెల్‌ సాంకేతికతను పరిశీలించాం. సీమలో పశువులకు కూడా గడ్డి దొరకని పరిస్థితి గతంలో ఉండేది. రాయలసీమలో ప్రస్తుతం 944 టీఎంసీల నీరు ఉంది’ అని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

వివేకారెడ్డి హత్య కేసు.. కోర్టు తీర్పుపై ఉత్కంఠ

ఏపీ వృద్ధిరేటు పెంపునకు ప్రభుత్వం చర్యలు.. అధికారులకు సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు

Read Latest AP News And Telugu News

Updated Date - Dec 10 , 2025 | 12:17 PM