Share News

Viveka case: వివేకారెడ్డి హత్య కేసు.. కోర్టు తీర్పుపై ఉత్కంఠ

ABN , Publish Date - Dec 10 , 2025 | 09:08 AM

మాజీ మంత్రి వివేకా నందరెడ్డి హత్య కేసులో సమగ్ర దర్యాప్తు జరపాలని ఆయన కూతురు సునీతారెడ్డి సీబీఐ కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై సీబీఐ కోర్టు ఇవాళ(బుధవారం) కీలక తీర్పు వెల్లడించనుంది.

Viveka case: వివేకారెడ్డి హత్య కేసు.. కోర్టు తీర్పుపై ఉత్కంఠ
Vivekananda Reddy case

అమరావతి,డిసెంబరు10 (ఆంధ్రజ్యోతి): మాజీ మంత్రి వివేకా నందరెడ్డి హత్య కేసులో (Vivekananda Reddy case) సమగ్ర దర్యాప్తు జరపాలని ఆయన కూతురు సునీతారెడ్డి సీబీఐ కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై సీబీఐ కోర్టు ఇవాళ(బుధవారం) కీలక తీర్పు వెల్లడించనుంది. ఈ కేసులో తదుపరి దర్యాప్తు జరపాలని సీబీఐకు ఆదేశాలు ఇవ్వాలంటూ పిటిషన్‌లో పేర్కొన్నారు సునీత. మరింత దర్యాప్తు కోసం న్యాయస్థానం ఆదేశిస్తే తమకు కూడా ఎలాంటి అభ్యంతరం లేదని స్పష్టం చేశారు సీబీఐ అధికారులు.


ఈ క్రమంలోనే సీబీఐ మరింత సమగ్ర దర్యాప్తునకు సమ్మతం తెలుపుతూ కౌంటర్ దాఖలు చేశారు ఏ2 నిందితుడు సునీల్ యాదవ్. తన తండ్రి హత్య కేసులో సమగ్ర దర్యాప్తు జరపకపోతే అసలైన వ్యక్తులు తప్పించుకునే ప్రమాదం ఉందని పేర్కొన్నారు సునీత. ఇదే కేసులో సప్లిమెంటరీ ఛార్జ్‌షీట్ దాఖలు చేసేలా సీబీఐకి ఆదేశాలు ఇవ్వాలని సీబీఐ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు సునీత. ఈ కేసులో సమగ్ర దర్యాప్తు జరిపితే ఇప్పటివరకు వెలుగు చూడని సంచలన విషయాలు బయటకు వస్తాయని అభిప్రాయపడ్డారు సునీతారెడ్డి. అయితే, వివేకా కేసులో సీబీఐ కోర్టు ఇప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనని పలువురు ఉత్కఠంగా ఎదురుచూస్తున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

వల్లభనేని వంశీకి బిగ్ షాక్.. పోలీసుల అదుపులో ప్రధాన అనుచరుడు

ఎన్టీఆర్ సర్కిల్‌కు వాజ్‌పేయి పేరు.. టీడీపీ అభ్యంతరం

Read Latest AP News and National News

Updated Date - Dec 10 , 2025 | 09:31 AM