Share News

NTR Circle Dispute: ఎన్టీఆర్ సర్కిల్‌కు వాజ్‌పేయి పేరు.. టీడీపీ అభ్యంతరం

ABN , Publish Date - Dec 08 , 2025 | 10:27 AM

మచిలీపట్నంలో ఎన్టీఆర్ సర్కిల్ వివాదాస్పదంగా మారింది. గత రెండు రోజుల క్రితం హౌసింగ్ బోర్డు రింగ్‌కు దివంగత మాజీ ప్రధానమంత్రి అటల్‌ బిహారీ వాజ్‌పేయి సర్కిల్ అని నామకరణం చేసి ప్లెక్సీలు ఏర్పాటు చేశారు బీజేపీ నేతలు. అయితే ఈ విషయంపై టీడీపీ నేతలు అభ్యంతరం చెబుతున్నారు.

NTR Circle Dispute: ఎన్టీఆర్ సర్కిల్‌కు వాజ్‌పేయి పేరు.. టీడీపీ అభ్యంతరం
NTR Circle Dispute

కృష్ణాజిల్లా, మచిలీపట్నం, డిసెంబరు 8 (ఆంధ్రజ్యోతి): మచిలీపట్నంలో ఎన్టీఆర్ సర్కిల్ వివాదాస్పదంగా (Machilipatnam NTR Circle Dispute) మారింది. గత రెండు రోజుల క్రితం హౌసింగ్ బోర్డు రింగ్‌కు దివంగత మాజీ ప్రధానమంత్రి అటల్‌ బిహారీ వాజ్‌పేయి సర్కిల్ (Atal Bihari Vajpayee Circle) అని నామకరణం చేసి ప్లెక్సీలు ఏర్పాటు చేశారు బీజేపీ నేతలు. ఇవాళ(సోమవారం) అదే రింగ్‌లో వాజ్‌పేయి విగ్రహా శంకుస్థాపనకు సిద్ధమయ్యారు బీజేపీ నేతలు. ఈ క్రమంలోనే వాజ్‌పేయి పేరు పెట్టడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు తెలుగుదేశం నేతలు.


ఈ నేపథ్యంలోనే హౌసింగ్ బోర్డు రింగ్‌లో కూర్చుని నిరసన తెలిపారు అర్బన్ బ్యాంక్ చైర్మన్ దిలీప్ కుమార్. గతంలోనే హౌసింగ్ బోర్డు రింగ్ సెంటర్‌ను ఎన్టీఆర్ సర్కిల్‌గా నామకరణ చేస్తూ మున్సిపాల్టీలో తీర్మానం చేసిన విషయం తెలిసిందే. ఎన్టీఆర్ విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేయాలని మున్సిపాల్టీలో తీర్మానం చేసింది అప్పటి పాలకవర్గం. ఎన్టీఆర్ సర్కిల్‌గా ఉన్న ఈ సెంటర్‌ను.. వాజ్‌పేయి సర్కిల్‌గా ఎలా పెడతారని ప్రశ్నిస్తున్నారు టీడీపీ నేతలు. వాజ్‌పేయీ సర్కిల్‌గా పెట్టవద్దని తెలుగు తమ్ముళ్ల ఆందోళనకు దిగారు. ఇదే క్రమంలో హౌసింగ్ బోర్డ్ రింగ్‌కు వచ్చి బీజేపీ నేతలు కూడా పోటాపోటీగా నిరసన తెలిపారు. ఇప్పుడు ఈ వివాదం మచిలీపట్నంలో చర్చనీయాంశంగా మారింది.


ఈ వార్తలు కూడా చదవండి..

విద్యావ్యవస్థలో సమూల మార్పులు తీసుకొస్తాం: పవన్ కల్యాణ్

గిరిజనులకు జీవనోపాధి మార్గాలు పెంచాలి

Read Latest AP News and National News

Updated Date - Dec 08 , 2025 | 11:12 AM