Share News

Pawan Kalyan: విద్యావ్యవస్థలో సమూల మార్పులు తీసుకొస్తాం: పవన్ కల్యాణ్

ABN , Publish Date - Dec 06 , 2025 | 03:51 PM

విద్యావ్యవస్థలో సమూల మార్పులు తీసుకురావాలనే ధృడ సంకల్పంతో తమ ప్రభుత్వం పనిచేస్తోందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు. విద్యార్థులకు ఆహ్లాదకరమైన వాతావరణంలో, అధునాతన సదుపాయాలు కల్పించి, పోషక ఆహారాన్ని, నాణ్యమైన విద్యను అందించాలని ప్రభుత్వం భావిస్తోందని పేర్కొన్నారు.

Pawan Kalyan: విద్యావ్యవస్థలో సమూల మార్పులు తీసుకొస్తాం: పవన్ కల్యాణ్
Pawan Kalyan

అమరావతి, డిసెంబరు6 (ఆంధ్రజ్యోతి): విద్యావ్యవస్థలో సమూల మార్పులు తీసుకురావాలనే ధృడ సంకల్పంతో తమ ప్రభుత్వం పనిచేస్తోందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ (Pawan Kalyan) వ్యాఖ్యానించారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్‌లో ట్వీట్ పెట్టారు డిప్యూటీ సీఎం. విద్యార్థులకు ఆహ్లాదకరమైన వాతావరణంలో, అధునాతన సదుపాయాలు కల్పించి, పోషక ఆహారాన్ని, నాణ్యమైన విద్యను అందించాలని ప్రభుత్వం భావిస్తోందని పేర్కొన్నారు.


ఇదే లక్ష్యంతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో మంత్రి నారాలోకేష్ చేస్తున్న కృషికి అభినందనీయమని ప్రశంసించారు. తల్లిదండ్రులను, ఉపాధ్యాయులను భాగస్వామ్యం చేసేలా నిర్వహిస్తున్న మెగా పేరెంట్, టీచర్చ్ మీటింగ్స్‌లో పాల్గొనడం ఆనందంగా ఉందని వ్యాఖ్యానించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

విద్యావ్యవస్థలో సమూల మార్పులు తీసుకొస్తాం: పవన్ కల్యాణ్

గిరిజనులకు జీవనోపాధి మార్గాలు పెంచాలి

Read Latest AP News and National News

Updated Date - Dec 06 , 2025 | 05:12 PM