Home » Atal Bihari Vajpayee
అమరావతిలో ఒక చరిత్రను సృష్టించే విధంగా వాజ్‌పేయి విగ్రహం ఏర్పాటు చేసుకున్నామని సీఎం చంద్రబాబు అన్నారు. ఈనెల 11 నుంచి అటల్ మోదీ సురిపాల యాత్రను ప్రారంభించారని తెలిపారు. అమరావతిలో 14 అడుగుల వాజ్‌పేయ్ విగ్రహాన్ని ఆవిష్కరించామని సీఎం తెలిపారు.
ఒక్క ఓటు తేడా ఉంటే నైతిక విలువలకు కట్టుబడి రాజీనామా చేసి ప్రధాని పదవిని తృణ ప్రాయంగా వదులుకున్న మహోన్నతమైన నేత అటల్ జీ అని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. భారతదేశ రక్షణ కోసం ఎంతో కృషి చేసి సుపరిపాలన అందించిన నేత అని తెలిపారు.
వాజ్‌పేయి జయంతిని ప్రధానమంత్రి నరేంద్రమోదీ సుపరిపాలన దినోత్సవంగా ప్రకటించారని ఏపీ బీజేపీ అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ పేర్కొన్నారు. అమరావతిలో వాజ్‌పేయ్ తొలి విగ్రహాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఇచ్చిన చంద్రబాబుకు ధన్యవాదాలు తెలిపారు.
వాజ్‌పేయి జయంతి సందర్భంగా ఇవాళ సుపరిపాలన దినోత్సవంగా ప్రకటించారు ప్రధానమంత్రి నరేంద్రమోదీ. ఈ క్రమంలో అటల్ - మోదీ సుపరిపాలన యాత్ర ముగింపు సభ గురువారం వెంకటపాలెం వద్ద నిర్వహించారు.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పీవీఎన్ మాధవ్ నేతృత్వంలో రాష్ట్రవ్యాప్తంగా సాగిన అటల్ - మోదీ సుపరిపాలన యాత్ర అమరావతిలోని వేంకటపాలెం వద్ద ముగియనుంది. నేడు వాజ్‌పేయ్ కాంస్య విగ్రహావిష్కరణతో పాటు స్మృతి వనం ప్రారంభోత్సవాలు జరుగనున్నాయి.
ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసానికి చేరుకున్న కేంద్రమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అల్పాహార విందులో పాల్గొన్నారు. ఆపై ఇరువురు కలిసి అమరావతికి బయలుదేరి వెళ్లనున్నారు.
అటల్‌జీ 101వ జయంతి సందర్భంగా లక్నోలోని గోమ్తీ నది ఒడ్డున నిర్మించిన రాష్ట్ర ప్రేరణ స్థల్‌ను ప్రధాని నేడు జాతికి అంకితం చేస్తారు. 65 ఎకరాల విస్తీర్ణంలో రూ.230 కోట్ల ఖర్చుతో నిర్మితమైన ఈ జాతీయ స్మారక సముదాయంలో..
అటల్, చంద్రబాబులకు మధ్య సన్నిహిత సంబంధాలు ఉన్నాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పీవీఎన్ మాధవ్ తెలిపారు. సైబరాబాద్, శంషాబాద్ ఎయిర్ పోర్ట్‌లకు నాడు వాజ్‌పేయి సహకారం అందించారని గుర్తుచేశారు.
మాజీ ప్రధాని, దివంగత నాయకుడు, భారతరత్న అటల్ బిహారీ వాజ్‌పేయ్ జీవితం తెరిచిన పుస్తకం అని.. ప్రతి పేజీ స్ఫూర్తి దాయకం అని పేర్కొన్నారు భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు. శ్యాం ప్రసాద్ ముఖర్జీ ఆశయ సాధన కోసం వాజ్‌పేయ్ నిరంతరం కృషి చేశారని చెప్పారు.
నేటి యువత వాజ్‌పేయి గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉందని కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు. . విజన్ ఉన్న నాయకుడు చంద్రబాబు అని పేర్కొన్నారు.