CM Chandrababu: కేంద్రమంత్రి శివరాజ్‌ను ఇంటికి ఆహ్వానించిన సీఎం చంద్రబాబు
ABN , Publish Date - Dec 25 , 2025 | 10:40 AM
ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసానికి చేరుకున్న కేంద్రమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అల్పాహార విందులో పాల్గొన్నారు. ఆపై ఇరువురు కలిసి అమరావతికి బయలుదేరి వెళ్లనున్నారు.
అమరావతి, డిసెంబర్ 25: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) నివాసానికి కేంద్రమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ (Union Minister Shivaraj Singh Chouhan) ఈరోజు (గురువారం) ఉదయం చేరుకున్నారు. తన నివాసానికి రావాల్సిందిన కేంద్రమంత్రిని సీఎం ఆహ్వానించారు. ఈ మేరకు ఉదయం సీఎం నివాసానికి చేరుకున్ని కేంద్రమంత్రి శివరాజ్ సింగ్ అల్పాహార విందులో పాల్గొన్నారు. అనంతరం మరికొద్ది సేపట్లో ఇరువురు కలిసి అమరావతికి బయలుదేరి వెళ్లనున్నారు. రాజధాని అమరావతిలోని వెంకటపాలెంలో మాజీ ప్రధాని వాజ్‌పేయ్ కాంస్య విగ్రహాన్ని సీఎం, కేంద్రమంత్రి ఆవిష్కరించనున్నారు. అక్కడే వాజ్‌పేయి స్మృతి వనం ఏర్పాటుకు ప్రభుత్వం భూమిని కేటాయించిన విషయం తెలిసిందే.
మరోవైపు ఈరోజుతో అటల్ మోదీ సుపరిపాలన యాత్ర ముగియనుంది. బీజేపీ ఏపీ అధ్యక్షులు పీవీఎన్ మాధవ్ నేతృత్వంలో ఈనెల 11 న ధర్మవరంలో ఈ యాత్ర ప్రారంభమైంది. ఇందులో భాగంగా రాయలసీమ, ఉత్తరాంధ్ర, కోస్తా జిల్లాల్లో సుపరిపాలన యాత్ర ద్వారా వాజ్‌పేయి విగ్రహాలను నేతలు ఆవిష్కరించారు. అలాగే ఈరోజు ఏపీ రాజధాని అమరావతిలోని వెంకటపాలెం సీడ్ యాక్సిస్ రోడ్ వద్ద ముగింపు సభ జరుగనుంది.
వాజ్‌పేయి శత జయంతి సందర్భంగా నేడు 12 అడుగుల కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. ఆయన పేరుతో ఏర్పాటు చేసిన స్మృతి వనాన్ని ప్రారంభించనున్నారు. సీఎం చంద్రబాబు, కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, పీవీఎన్ మాధవ్ కలిసి వాజ్‌పేయ్ కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. అనంతరం ముగింపు సభలో అతిధులు ప్రసంగించనున్నారు.
ఇవి కూడా చదవండి...
ఘోర ప్రమాదం.. స్పాట్‌లోనే నలుగురు మహిళలు మృతి
తీవ్ర విషాదం.. సెప్టిక్ ట్యాంక్‌లోపడి ఆరేళ్ల బాలుడు మృతి..
Read Latest AP News And Telugu News