Share News

Rajanna Siricilla: తీవ్ర విషాదం.. సెప్టిక్ ట్యాంక్‌లో‌పడి ఆరేళ్ల బాలుడు మృతి..

ABN , Publish Date - Dec 25 , 2025 | 08:05 AM

ఇటీవల కాలంలో గ్రామీణ ప్రాంతాల్లో బోరు బావులు, నీటి సంపులు, సెప్టిక్ ట్యాంక్ మూతలు తెరిచి ఉండటం వల్ల చిన్న పిల్లలు తెలియకుండా అందులో పడి చనిపోతున్నారు.. ఇలాంటి ఘటనే సిరిసిల్లలో చోటు చేసుకుంది.

Rajanna Siricilla: తీవ్ర విషాదం.. సెప్టిక్ ట్యాంక్‌లో‌పడి ఆరేళ్ల బాలుడు మృతి..
Rajanna Sirisilla Accident

రాజన్న సిరిసిల్ల, డిసెంబర్ 25: రాజన్న సిరిసిల్ల (Rajanna Siricilla) లో విషాదం చోటు చేసుకుంది. అప్పటివరకు తమ కళ్ల ముందు ఆడుకుంటున్న చిన్నారి (boy) చనిపోయాడన్న విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు (parents) కన్నీరుమున్నీరవుతున్నారు. వివరాల్లోకి వెళితే.. పట్టణంలోని సర్ధార్ నగర్‌(Sardar Nagar)లో ఓ ఆరేళ్ల బాలుడు ఆడుకుంటూ ప్రమాదవశాత్తూ సెప్టిక్ ట్యాంక్ (Septic tank) లో పడి ప్రాణాలు కోల్పోయాడు. బాలుడు తన ఇంటి సమీపంలో ఆడుకుంటుండగా, సెప్టిక్ ట్యాంక్ మూతసరిగా లేకపోవడంతో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.


అప్పటి వరకూ ఆడుకుంటూ ఉన్న బాలుడు సడెన్ గా అదృశ్యమవడంతో కుటుంబ సభ్యులు గాలించగా, సెప్టిక్ ట్యాంక్ లో విగతజీవిగా కనిపించాడు. వెంటనే బయటకు తీసి ఆస్పత్రికి తరలించినప్పటికీ.. అప్పటికే బాలుడు అతడు మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. చిన్నారి మృతిపై తల్లిదండ్రులు రోదనలు మిన్నంటాయి. చిన్నపిల్లలు ఉన్నవాళ్లు ఇళ్ల వద్ద నీటి సంపులు, సెప్టిక్ ట్యాంకుల మూతలు ఎప్పుడూ కప్పిఉంచాలని.. లేదంటే ఇలాంటి ప్రమాదాలే జరుగుతాయని అధికారులు హెచ్చరిస్తున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

తెలంగాణలో భారీ అగ్ని ప్రమాదం.. ఏమైందంటే..

ఆ ఛార్జీలు రద్దు చేయాలి.. టీజీఈఆర్సీకి నీటిపారుదల శాఖ లేఖ

Updated Date - Dec 25 , 2025 | 08:58 AM