Share News

TG Irrigation Department: ఆ ఛార్జీలు రద్దు చేయాలి.. టీజీఈఆర్సీకి నీటిపారుదల శాఖ లేఖ

ABN , Publish Date - Dec 23 , 2025 | 04:30 PM

తెలంగాణ నీటిపారుదల శాఖ అధికారులు మంగళవారం టీజీఈఆర్సీకి లేఖ రాశారు. ఈ లేఖలో పలు అంశాలను ప్రస్తావించారు. లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్‌కు డిమాండ్ ఛార్జీలు రద్దు చేయాలంటూ ప్రతిపాదన చేశారు.

TG Irrigation Department: ఆ ఛార్జీలు రద్దు చేయాలి.. టీజీఈఆర్సీకి నీటిపారుదల శాఖ లేఖ
TG Irrigation Department

హైదరాబాద్, డిసెంబరు 23 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ నీటిపారుదల శాఖ (TG Irrigation Department) అధికారులు ఇవాళ(మంగళవారం) టీజీఈఆర్సీ (TGERC)కి లేఖ రాశారు. ఈ లేఖలో పలు అంశాలను ప్రస్తావించారు. లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్‌కు డిమాండ్ ఛార్జీలు రద్దు చేయాలంటూ ప్రతిపాదన చేశారు. యూనిట్‌కు రూ.6.30 విద్యుత్ టారిఫ్ LISలకు అధికమని ప్రభుత్వ విభాగం అభిప్రాయం వ్యక్తం చేసిందని వివరించారు.


LISలు మాన్సూన్‌లో కేవలం 45 నుంచి 60 రోజులు మాత్రమే పనిచేస్తాయని తెలిపారు. మిగిలిన 10 నెలలు పంపింగ్ స్టేషన్లు దాదాపు ఐడిల్‌లోనే ఉంటాయని చెప్పుకొచ్చారు. మాన్సూన్ సమయంలో గ్రిడ్‌పై విద్యుత్ డిమాండ్ తక్కువగా ఉంటుందని స్పష్టం చేశారు. హైడ్రో పవర్ అందుబాటులో ఉన్న సమయంలోనే LISలు నడపాలని సూచించారు.


LISల వల్ల రైతుల పంపుసెట్లు భారీగా ఆఫ్ అవుతాయనే అంచనా వేశామని అన్నారు. వ్యవసాయ విద్యుత్ వినియోగంలో 25 నుంచి 40 శాతం తగ్గుదల అవకాశం ఉందని తెలిపారు. రైతులకు ఇచ్చే టారిఫ్‌నే LISలకు వర్తింపజేయాలనే డిమాండ్ ఉందని అన్నారు. గ్రిడ్ స్థిరత్వానికి LISలు కీలకంగా మారతాయని నివేదికలో ఉందని తెలంగాణ నీటిపారుదల శాఖ అధికారులు పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

తెలంగాణలో భారీ అగ్ని ప్రమాదం.. ఏమైందంటే..

అసెంబ్లీ ఎన్నికలు.. సత్తా చాటిన బీజేపీ

For More TG News And Telugu News

Updated Date - Dec 23 , 2025 | 04:33 PM